‘గెలాక్సీ ఎస్20’ వచ్చింది..

శాన్ ఫ్రాన్సిస్కో: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసంగ్.. ‘గెలాక్సీ ఎస్20’ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. ఈ నూతన సిరీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా టెక్నాలజీ ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో ‘గెలాక్సీ ఎస్20’, ‘గెలాక్సీ ఎస్20 ప్లస్’, ‘గెలాక్సీ ఎస్20 అల్ట్రా’ పేర్లతో మూడు వేరియంట్లు ఉన్నాయి. తొలి రెండు వేరియంట్లలో 64 మెగాపిక్సెల్ కెమెరా ఉండగా, అల్ట్రాలో ఏకంగా 108 ఎంపీ కెమెరా ఉన్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ హెడ్ టీఎం రోహ్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 6 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ మోడల్ ధరల శ్రేణి 999 నుంచి 1,399 డాలర్లుగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక ఇదే కార్యక్రమంలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ పేరిట ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదలచేసింది. ఫిబ్రవరి 14 నుంచి అందుబాటులోకి రానున్న దీని ధర 1,380 డాలర్లు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి