69.50–72 శ్రేణిలో రూపాయి స్థిరీకరణ! 

Rupee stabilization in the range of 69.50-72 - Sakshi

36 పైసలు నష్టంలో 71.16 వద్ద ముగింపు  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ 69.50 – 72 శ్రేణిలో స్థిరీకరణ జరుగుతున్నట్లు కనపడుతోంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ గురువారం 36 పైసలు నష్టపోయి, 71.16 వద్ద ముగిసింది. గురువారం 70.90 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒకదశలో 71.18 స్థాయికి పడింది. బుధవారం రూపాయి ముగింపు 70.80. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరల పటిష్టత, ప్రధాన కరెన్సీలపై డాలర్‌ బలపేత ధోరణి, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి వెనక్కు వెళుతున్న నిధులు రూపాయి బలహీనతకు తక్షణ కారణం.

అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి  క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి 10 డాలర్లకుపైగా పెరగడంతో రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. ఈక్విటీ మార్కెట్ల నష్టాలూ ఇందుకు తోడవుతున్నాయి. ఆయా పరిస్థితుల్లో రూపాయి ప్రస్తుతం స్థిరీకరణ బాటలో ఉందని భావిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రేటజీ హెడ్‌ వీకే శర్మ విశ్లేషించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top