
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ లాభాల నుంచి బ్రేక్ తీసుకుంది. డాలరు మారకంలో వరుసగా ఆరు రోజులపాటు లాభాల బాటలో సాగిన రూపాయి బుధవారం ట్రేడింగ్ ఆరంభంలోనే బలహీన పడింది. 43 పైసలు నీరసించి 68.96 వద్ద నిన్న ముగింపు నుంచి మరింత నష్టపోయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14 పైసలు క్షీణించి 69.10 వద్ద ప్రారంభమైంది.
ఇటీవల లాభాల బాట పట్టిన రూపాయి మంగళవారం 68.36 వద్ద 2019.. గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల్లో రూపాయి ఏకంగా 160 పైసలు పురోగమించింది. ఫెడ్ పాలసీ, ముడిచమురు ధరలు జోరందుకోవడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం వంటి అంశాలు కారణమైనట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.
అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా ఆరంభంలోనే బలహీనపడ్డాయి. 21 సెషన్స్‌లో భారీ లాభాలను ఆర్జించిన కీలక సూచీల్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. లాభనష్టాల మధ్య సెన్సెక్స్, నిఫ్టీ కొనసాగుతున్నాయి.