ఆర్‌బీఐ మూడు రోజుల కీలక  భేటీ ప్రారంభం 

 RBI will open a three-day crucial meeting - Sakshi

ముంబై: ద్రవ్య, పరపతి విధాన నిర్ణయానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మూడు రోజల సమావేశం సోమవారం ఇక్కడ ప్రారంభమైంది. గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) బుధవారం నాడు కీలక వడ్డీరేట్లపై తన విధానాన్ని ప్రకటించనుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) ఆర్‌బీఐ యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి.

అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండడం, గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 30 డాలర్లు దిగివచ్చిన క్రూడ్‌ ధరలు, ద్రవ్యోల్బణం తగిన స్థాయిల్లో ఉండడం, రేటు పెంపు విషయంలో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆచితూచి వ్యవహరిస్తుందనే సంకేతాలు, కఠిన అంతర్జాతయ ద్రవ్య పరిస్థితులు, దేశంలోనూ ఇదే ధోరణి నెలకొనడం దీనికి కారణం. ఆర్‌బీఐ స్వతంత్రతకు సంబంధించి కేంద్రంతో విభేదాలు, దిద్దుబాటు చర్యల పరిధిలో ఉన్న పదకొండు బ్యాంకుల్లో కొన్నింటిని తప్పించాలని కేంద్రం ఒత్తిడి తేనుందన్న వార్తలు తాజా సమావేశానికి నేపథ్యం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top