మ్యూచువల్ ఫండ్లకు ఆర్‌బీఐ భారీ ప్యాకేజీ

RBI announces  Rs 50000 crore special liquidity facility for mutual funds - Sakshi

సాక్షి, ముంబై : కోవిడ్ -19 సమయంలో ఆర్థిక భారాన్నిఎదుర్కొంటున్న సంస్థలను ఆదుకునేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)సోమవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.  కరోనా వైరస్ సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ (ఎస్‌ఎల్‌ఎఫ్-ఎంఎఫ్), ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి రూ. 50,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్నిఅందించాలని నిర్ణయించినట్లు ఆర్‌బిఐ తెలిపింది. ఈ సదుపాయం ఈ రోజు నుంచి మే 11వ తేదీవరకు అందుబాటులో వుంటుందని  స్పష్టం చేసింది. (కరోనా కట్టడి ఆశలు : లాభాల్లో మార్కెట్లు)

కరోనా వైరస్ , లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఎమ్‌ఎఫ్‌లపై లిక్విడిటీ ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎస్‌ఎల్‌ఎఫ్-ఎంఎఫ్ కింద, ఆర్‌బిఐ 90 రోజుల వ్యవధిలో రెపో కార్యకలాపాలను నిర్ణీత రెపో రేటుతో  ఆర్‌బీఐ నిర్వహిస్తుంది. 2020 ఏప్రిల్ 27 నుండి 2020 మే 11 వరకు లేదా కేటాయించిన మొత్తానికి అనుమతి వుంటుంది. ఎస్‌ఎల్‌ఎఫ్-ఎంఎఫ్,ఆన్-ట్యాప్ఓ,పెన్-ఎండెడ్,బ్యాంకులుసోమవారం- శుక్రవారం వరకు(సెలవులు మినహాయించి)  సంబంధిత నిధులు పొందటానికి తమ బిడ్లను సమర్పించవచ్చని తెలిపింది. ఎస్‌ఎల్‌ఎఫ్-ఎంఎఫ్ కింద లభించే లిక్విడిటీ సపోర్ట్‌ హెచ్‌టిఎమ్ పోర్ట్‌ఫోలియోలో చేర్చడానికి అనుమతించిన మొత్తం పెట్టుబడిలో 25 శాతానికి మించి మెచ్యూరిటీ (హెచ్‌టిఎం) ఉంటుందని వెల్లడించింది. ఈ మద్దతు బ్యాంకుల క్యాపిటల్ మార్కెట్ ఎక్స్‌పోజర్ పరిమితుల నుండి మినహాయించ బడుతుందని ఆర్‌బీఐ తెలిపింది. 

ప్రస్తుత ఆర్ధిక ఒత్తిడిపై ఆర్‌బిఐ అప్రమత్తంగా,ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆర్‌బీఐ  తాజా నిర్ణయంతో  మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.మరోవైపు ఈ వార్తలతో  మ్యూచువల్ ఫండ్  షేర్లన్నీ దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో లాభాల జోష్ లో ఉన్నాయి. (కరోనా ఎఫెక్ట్ : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలనం)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top