10వేల స్థాయి వద్ద నిఫ్టీకి గట్టిమద్దతు

పుట్ బిల్డ్-అప్ సంకేతాలు
ప్రధాన బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీకి 10000స్థాయి వద్ద కీలక మద్దతు స్థాయి నెలకొని ఉందని భారత ఈక్విటీ ఆప్షన్ ట్రేడర్లు విశ్వసిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల పరిశీలిస్తే.., నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్ కాంట్రాక్ట్‌ల్లో కెల్లా అత్యధిక ఓపెన్ ఇంటెస్ట్ర్ 10వేల స్ట్రైక్ ప్రైస్ పుట్ కాంట్రాక్టుల వద్ద ఉంది. దీని ప్రకారం గురువారం వరకు నిఫ్టీ 10వేల స్థాయిని పరిరక్షించుకోగలదని వారు అంచనా వేస్తున్నారు.
నిఫ్టీ ఇండెక్స్ మార్చి నెల తరువాత తొలిసారి ఈ జూన్ 10000 స్థాయిని అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుపుచ్చుకున్న దేశీయ ఈక్విటీ సూచీలు... ఈ మార్చి కనిష్ట స్థాయిల నుంచి 35శాతానికి మించి రికవరీ అయ్యాయి. మరోవైపు ఇదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ తొలిసారి 40ఏళ్ల కనిష్టాలను చవిచూసింది.
నిఫ్టీ ఇండెక్స్ బేస్ 9,700 నుండి 10,000 కు పెరిగింది. సాంకేతికంగానూ బలంగా ఉంది. రాబోయే వారంలో 10,600-10,800 శ్రేణిని పరీక్షించడానికి ఇటీవలి గరిష్ట స్థాయి 10,350-10,400 పరిధిని అధిగమించాల్సి ఉంటుంది.’’ అని ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ విశ్లేషకుడు సమీత్ చవాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వారంలో గురువారం డెరివేటివ్ కాంట్రాక్టు ఎక్స్‌పైరీ తేది ఉండటం, కొన్ని దేశాల్లో కరోనా వైరస్ రెండో దశ వ్యాధి వ్యాప్తి మొదలు కావడం, అమెరికా-చైనాల మధ్య మరోసారి వాణిజ్య ఉద్రిక్తతలు తెరపైకి రావడం తదితర ప్రతికూల అంశాల దృష్టా‍్య ఈ వారం మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మరికొందరు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి