తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు | Petrol, diesel prices cut | Sakshi
Sakshi News home page

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Nov 30 2015 7:03 PM | Updated on Sep 28 2018 3:22 PM

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - Sakshi

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర లీటర్కు 58 పైసలు, డీజిల్ ధర లీటర్కు 25 పైసలు చొప్పున తగ్గాయి.

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర లీటర్కు 58 పైసలు, డీజిల్ ధర లీటర్కు 25 పైసలు చొప్పున తగ్గాయి. కొత్త ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఓసారి సమావేశమై.. పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే.

15 రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్‌ లీటర్ కు 36 పైసలు, డీజిల్ లీటరుకు 87 పైసలు చొప్పున పెరిగాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఈసారి తగ్గాయి.

Advertisement
 
Advertisement
Advertisement