డీజిల్‌ ధర కూడా దిగి వచ్చింది | Petrol Diesel Prices Continue to Tumble | Sakshi
Sakshi News home page

డీజిల్‌ ధర కూడా దిగి వచ్చింది

Nov 2 2018 7:59 AM | Updated on Nov 2 2018 6:11 PM

Petrol Diesel Prices Continue to Tumble - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్‌ ధరలు శుక్రవారం మరింత తగ్గాయి.  ఒక రోజు విరామం తరువాత నిన్న పెట్రోలు ధరను  తగ్గించి, డీజిల్‌ ధరను యథాతథంగా ఉంచిన ఆయిల్‌  సంస్థలు తాజాగా డీజిల్‌  రేటును కూడా తగ్గించాయి. పెట్రోలుపై లీటరుకు 19 పైసలు, డీజిల్‌ ధర లీటరుకు14 పైసలు తగ్గింది.  తాజా తగ్గింపుతో  దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు ఈ విధంగా ఉన్నాయి. 

ఢిల్లీ: పెట్రోలు లీటరుకు రూ. 79.18, డీజిలు రూ. 73.64గా ఉంది.
ముంబై : పెట్రోలు లీటరుకు రూ.84.68, డీజిలు రూ. 77.18గా ఉంది.
హైదరాబాద్‌ : పెట్రోలు లీటరుకు రూ.83. 96, డీజిలు రూ.80.12గా ఉంది.
విజయవాడ: పెట్రోలు లీటరుకు రూ.83.10, డీజిలు రూ. 78.87గా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement