ముకేశ్ అంబానీ వేతనం 8వ ఏడాదీ రూ.15 కోట్లే! | Mukesh Ambani keeps salary capped at Rs 15 cr for 8th year | Sakshi
Sakshi News home page

ముకేశ్ అంబానీ వేతనం 8వ ఏడాదీ రూ.15 కోట్లే!

Aug 5 2016 1:07 AM | Updated on Jul 11 2019 6:22 PM

ముకేశ్ అంబానీ వేతనం 8వ ఏడాదీ రూ.15 కోట్లే! - Sakshi

ముకేశ్ అంబానీ వేతనం 8వ ఏడాదీ రూ.15 కోట్లే!

భారత్ ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ వరుసగా ఎనిమిదవ ఏడాది 2015-16 సంవత్సరంలోనూ రూ.15 కోట్ల వేతనమే తీసుకున్నారు.

న్యూఢిల్లీ : భారత్ ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ వరుసగా ఎనిమిదవ ఏడాది 2015-16 సంవత్సరంలోనూ రూ.15 కోట్ల వేతనమే తీసుకున్నారు. ఆమోదిత మొత్తం రూ.38.75 కోట్లు అయినా... రూ.15 కోట్లను ఆయన తీసుకున్నట్లు 2015-16 వార్షిక నివేదికలో ఆర్‌ఐఎల్ తెలిపింది. ఉన్నత నిర్వహణ స్థాయిలో వేతనాల నియంత్రణకు సంబంధించి  ఉదాహరణగా నిలుస్తూ... ఆయన ఈ తక్కువ వేతనం పొందేందుకు తనకుతాను నిర్ణయం తీసుకున్నారు. సంస్థ బోర్డ్‌లోని ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల వేతనం భారీగా పెరుగుతున్నా... ముకేశ్ తన నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement