-
జొమాటోకు షాకిచ్చిన ఉద్యోగులు.. భారీ ఎత్తున నిలిచిపోయిన సేవలు!
‘ఆలస్యం విషం, వేగమే అమృతం’.. దేశంలోని ప్రముఖ డెలివరీ స్టార్టప్స్ ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. ఉదయాన్నే వంటింట్లో నుంచి ఘుమఘుమలు ఇంటిల్లాపాదిని పలకరిస్తుంటే కూరలోకి ఉప్పు లేకపోతే.. గాభరా పడాల్సిన పన్లేదు. స్మార్ట్‌ఫోన్‌లో ఆర్డర్ చేస్తే కుతకుతమని ఉడికేలోగా లవణం లావణ్యంగా ఇంటికి వచ్చేస్తుంది. ‘మాటకు పది నిమిషాలని అంటున్నాం కానీ, మా సగటు డెలివరీ సమయం ఎనిమిది నిమిషాల పైచిలుకే’ అంటున్నాయి డెలివరీ సంస్థలు. ఇదంతా బాగానే ఉన్నా బైక్ పంక్చర్, ట్రాఫిక్ సిగ్నల్,అన్నిటికీ మించి స్పీడ్ బ్రేకర్ల కన్నా స్పీడుగా బ్రేకులు వేయించే గుంతలతో వ్యయప్రయాసలకు ఓర్చి పది నిమిషాల్లో డెలివరీ చేసే ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా? అంటే లేదనే అంటున్నారు జొమాటోకి చెందిన ‘బ్లింకిట్’ ఉద్యోగులు. బ్లింకిట్ యాప్‌కు చెందిన సిబ్బంది తాము చేస్తున్న పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు. డెలివరీ చేయడం మానేశారు. దీంతో ఆ సంస్థ దేశ వ్యాప్తంగా 400 స్టోర్ల నుంచి సర్వీసుల్ని అందిస్తుండగా.. ఉద్యోగుల నిర్ణయంతో వాటిలో పదుల సంఖ్యలో స్టోర్లు మూత పడ్డాయి. మరోవైపు సిబ్బంది ఆందోళన చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల బ్లింకిట్ కొత్త చెల్లింపుల పద్దతిని అమలు చేసిందని, ఆ నిర్ణయం వల్ల గతంలో డెలివరీ చేసిన ఆర్డర్లకు పొందే వేతనాలు బాగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు జొమాటో మెయిల్ కాగా,ఉద్యోగులకు జొమాటో మెయిల్ పెట్టింది. ఆ మెయిల్లో రైడర్ల కోసం కొత్త చెల్లింపుల పద్దతిని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ పద్దతిలో చేసే డెలివరీల ఆధారంగా చెల్లింపులు ఉంటాయని, షట్‌డౌన్ చేసిన స్టోర్లను తిరిగి ప్రారంభించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్లు స్పష్టం చేసింది. చదవండి👉 జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా! -
కనీస వేతనాలపై మీ వైఖరి ఏమిటి? ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్:కనీస వేతనాలకు సంబంధించి జీవోలు ఇచ్చి.. గెజిట్ ప్రింట్ చేయకపోవడంపై వైఖరిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది. ఐదేళ్లకు ఒకసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉండగా 2007 తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఇవ్వలేదని పేర్కొంటూ తెలంగాణ రీజినల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. ప్రభుత్వం వెంటనే గెజిట్‌ను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ప్రతివాదులుగా సీఎస్, కార్మిక శాఖ కమిషనర్ తదితరులను పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
అయ్యో.. ఏమైందో ఏమో!
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: కూలి పనికోసం వలస వచ్చిన వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. రాత్రి పడుకున్న మంచంపైనే తెల్లవారేసరికి విగతజీవులుగా మారారు. ఈ విషాదకర సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ధన్వాడ మండ లం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నాగారం హను మంతు (65), భార్య వెంకటమ్మ(50)తో కలిసిఅబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్పూర్లో సుగుణ అనే మహిళా రైతు వద్ద హార్టీకల్చర్ పనులు చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. మంగళవారం ఉదయం ఇంకా ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో సుగుణ వారిని పిలిచేందుకు వెళ్లింది. లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో పాటు దంపతులిద్దరూ స్పందించకపోవడంతో అనుమా నం వచ్చి విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. దీంతో కొంతమంది వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా హనుమంతుదంపతులు మంచంపై విగతజీవులుగా కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. మృతుల కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. (చదవండి: ‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’!) -
సర్పంచ్ పైశాచికం.. కూలీ డబ్బులు అడిగిన దివ్యాంగుడిపై దాడి
మహబూబ్ నగర్: తనకు రావాల్సిన ఉపాధి హామీ కూలి డబ్బులు ఇప్పించాలని అడిగిన ఓ వికలాంగుడిని సర్పంచ్ కాలితో తన్ని దుర్భాషలాడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. హన్వాడ మండలం ఫుల్పోనీ గ్రామంలో వికలాంగుడైన కృష్ణయ్య తనకు రావాల్సిన ఉపాధి కూలీ డబ్బులు ఇంతవరకు రాలేదని, ఆ డబ్బులు ఇప్పించాలని అధికార పార్టీ సర్పంచ్ శ్రీనివాసులును అడగడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో వికలాంగుడైన కృష్ణయ్య కుటుంబ సభ్యులు, తదితరులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సర్పంచ్ శ్రీనివాసులు వికలాంగుడు కృష్ణయ్యతో పాటు అధికారులను సైతం బండ బూతులు తిడుతూ.. కాలితో తన్నాడు. ఈ సంఘటన చూసిన మరికొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రూపులలో హల్చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు కేసును సుమోటోగా స్వీకరించారు. సర్పంచ్‌ను సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్ -
గల్ఫ్ దేశాల్లో 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' ఉండాలి!
ఆసియా-గల్ఫ్ వలసల కారిడార్ దేశాలలో వేతనాల చెల్లింపులపై ఉత్తమ ఆచరణపై ఖతార్ రాజధాని దోహాలో వలసలపై జరుగుతున్న సమావేశంలో మంగళవారం చర్చ జరిగింది. ముఖ్యంగా వేతనాల ఎగవేత, ఇతర వేతన సమస్యల పరిష్కార విధానాలపై చర్చ సాగింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం), మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) లు సంయుక్తంగా ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఖతార్‌లో సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ఖతార్ ప్రభుత్వం అధికారిక ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి, ప్రవాసి కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్ల ఐక్యరాజ్య సమితి ప్రవాసి కార్మికులకు వేతన రక్షణ నిధి ఏర్పాటు, వలస కార్మికులను రక్షించడానికి కార్మికులను పంపే మూలస్థాన దేశాలు ఏవైనా విధానాలు, శాశ్వత పరిష్కార వ్యవస్థలను కలిగి ఉన్నాయా? అనే ప్రశ్నించారు. నష్టపోయిన కార్మికులను, విదేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికుల రక్షణకోసం మూలస్థాన దేశాలు పునరావాసం, పునరేకీకరణ కోసం ఒక విధానం, శాశ్వత యంత్రాంగం కలిగి ఉండాలని స్వదేశ్ కోరారు. 32 సంవత్సరాల క్రితం 1990-91లో ఇరాక్ - కువైట్ గల్ఫ్ యుద్ధం కారణంగా లక్షలాది మంది వలసదారులు కువైట్ నుండి వారి స్వదేశాలకు తిరిగి పంపబడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుబంధ సంస్థ 'ది యునైటెడ్ నేషన్స్ కంపెన్సేషన్ కమిషన్' (పరిహార కమిషన్) కువైట్‌పై ఇరాక్ దాడికి సంబంధించి 52.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చెల్లింపులను పూర్తి చేసిందని స్వదేశ్ గుర్తు చేశారు. అలాగే ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఇరాక్, లిబియా, యెమెన్ లాంటి దేశాలలో యుద్ధ పరిస్థితులు, దివాళా తీసిన కంపెనీలను మూసివేయడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించి, వీసా గడువు ముగిసిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్షలు లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు 4-5 ఏళ్లకు ఒకసారి క్షమాభిక్ష (అమ్నెస్టీ) ప్రకటించడం, కోవిడ్19 మహమ్మారి లాంటి విపత్తు వలన వలస కార్మికులను బలవంతంగా ఆయా దేశాల నుండి కట్టుబట్టలతో స్వదేశీలకు పంపించివేస్తున్నారని స్వదేశ్ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇలా జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు తగిన రక్షణ చర్యలతో సన్నద్ధంగా ఉండాలని సూచించారు ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖలో వేతన రక్షణ విభాగం అధినేత మహమ్మద్ సైద్ అల్ అజ్బా, ఖతార్ లోని ఫిలిప్పీన్ రాయబార కార్యాలయం కార్మిక అధికారి డాన్ ఆల్బర్ట్ ఫిలిప్ సి. పాన్కోగ్, ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) రీజనల్ కోఆర్డినేటర్ విలియం గోయిస్, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ సుమన్ సొంకర్, ఖతార్‌లోని హమద్ బిన్ ఖలీఫా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.రే జురీడిని పానెల్ ప్రవాసుల వేతన సమస్యలపై ప్రసంగించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) అరబ్ దేశాల వలస నిపుణుడు రిసార్డ్ చోలెవిన్స్కీ మోడరేటర్ గా వ్యవహరించారు. వలస కార్మికుల వేతనాలపై కోవిడ్-19 ప్రభావం, దీనిక అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై ప్యానల్ వక్తలు ప్రసంగించారు. అలాగే కోవిడ్19 మహమ్మారి సంక్షోభం కంటే ముందు గమ్యస్థాన గల్ఫ్ దేశాలు కార్మికులకు 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' (వేతనాల భరోసా రక్షణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి ప్రయోగాలు చేశాయి. వేతన చెల్లింపులను పర్యవేక్షించడం, అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేశాయని వక్తలు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement