బడ్జెట్‌ ధరలో మోటో జీ 8 పవర్‌ లైట్‌ | Motorola G8 Power Lite launched in India | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ ధరలో మోటో జీ 8 పవర్‌ లైట్‌

May 21 2020 5:38 PM | Updated on May 21 2020 5:43 PM

Motorola G8 Power Lite launched in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  జీ సిరీస్‌లో భాగంగా  మోటోరోలా మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో జీ8 పవర్ లైట్  పేరుతో బడ్జెట్‌ ధరలో  గురువారం  తీసుకొచ్చింది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్,ట్రిపుల్ రియర్ కెమెరా, అద్భుతమైన పవర్‌  ప్రధాన ప్రత్యేకతలుగా ఉన్నాయి.

4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో  విడుదలైన ఈ ఫోన్‌ ధరను రూ.8999గా ఉంచింది.  మే 29 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో  సేల్ ప్రారంభమవుతుంది.  రెండు  కలర్స్‌ లో లభ్యం. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.

మోటరోలా జీ8 పవర్ లైట్  ఫీచర్స్
6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
మీడియాటెక్ హీలియో పీ35ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10
4 జీబీ  ర్యామ్ 64 జీబీ స్టోరేజ్
16 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

చదవండి : జియోలో కేకేఆర్‌ పెట్టుబడులు : మరో మెగా డీల్‌?
బీఎండబ్ల్యూ సూపర్‌ బైక్స్‌ లాంచ్‌
ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో లాంచ్‌.. ధర ఎంతంటే?

Advertisement
 
Advertisement
Advertisement