బీఎండబ్ల్యూ సూపర్‌ బైక్స్‌ లాంచ్‌

BMW launches imported luxury motorcycles F 900 R and F 900 XR - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ  బీఎండబ్ల్యూ మోట్రాడ్ ఇండియా  కొత్త ఎఫ్ 900 ఆర్, ఎఫ్ 900 ఎక్స్‌ఆర్  బైక్‌లను దేశంలో విడుదల చేసింది.  ఎఫ్‌900 ఆర్‌ను  సింగిల్ స్టాండర్డ్ వేరియంట్లో లాంచ్ చేయగా , ఎక్స్‌ ఆర్‌ మోడల్‌ను స్టాండర్డ్,  ప్రో వేరియంట్లలో  అందుబాటులో వుంటాయి.  ఈ రెండు బైక్‌లను జర్మనీలోని కంపెనీ ఫ్యాక్టరీల నుండి దిగుమతి చేస్తోంది.

ఎఫ్ 900 ఆర్ ధర రూ .9.90 లక్షలు కాగా, ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ స్టాండర్డ్‌ ధర, రూ .10.50 లక్షలు.  ప్రో వేరియంట్ (ఎక్స్‌షోరూమ్, న్యూఢిల్లీ)  ధర  రూ.11. 50 లక్షలుగా నిర్ణయించింది. (ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో లాంచ్‌.. ధర ఎంతంటే?)

ఈ రెండు బైక్‌లను  'రెయిన్'   'రోడ్' రైడింగ్ మోడ్‌లతో లాంచ్‌ చేసింది. అంతేకాదు ఈ రెండు బైక్‌లలో  తొలిసారిగా  ప్లాస్టిక్-వెల్డెడ్ ఇంధన ట్యాంకులను అమర్చింది. ఇదే  ఆసక్తికరమైన హైలైట్.

ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రీమియం మోటార్‌సైకిళ్లను భారతదేశానికి తీసుకువచ్చామనీ, మిడ్‌ రేంజ్‌  విభాగంలో  ఆకర్షణీయమైన విలువతోయూజర్లను ఆకట్టుకుంటాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా యాక్టింగ్ ప్రెసిడెంట్ అర్లిండో టీక్సీరా అన్నారు

ఎఫ్ 900 ఆర్ లో 13-లీటర్ ఇంధన ట్యాంక్‌ను, ఎఫ్ 900 ఎక్స్‌ ఆర్15.5 లీటర్  ట్యాంకును ఇచ్చింది.  వీటిల్లో బీఎండబ్ల్యూ మోట్రాడ్ కనెక్టివిటీతో  6.5 అంగుళాల కలర్ టిఎఫ్‌టి స్క్రీన్‌ను అమర్చింది.  ఇంకా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ , యాంటీ-హోపింగ్ క్లచ్ ,  కాస్ట్ అల్యూమినియం వీల్స్ , ఆల్-ఎల్ఇడి హెడ్‌ల్యాంప్  లాంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.

ఇవి 8500 ఆర్‌పిఎమ్ వద్ద 105 హెచ్‌పి పవర్‌ను,  6500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 92 ఎన్‌ఎమ్ టార్క్‌ను అందిస్తాయి. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగం పుంజుకుంటాయి.  గంటకు 200 కి.మీ  గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. ఈ సూపర్‌ బైక్‌లు కవా సాకి వెర్సిస్ 1000,  డుకాటీ మల్టీస్ట్రాడా 950 వంటి వాటికి  గట్టిపోటీ ఇవ్వనున్నాయని మార్కెట్‌ వర్గాల అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top