వాలెట్ బ్యాలెన్స్పై 6% వార్షిక లాభం | MobiKwik to offer 6% annual return to wallet users | Sakshi
Sakshi News home page

వాలెట్ బ్యాలెన్స్పై 6% వార్షిక లాభం

Jun 3 2016 1:30 AM | Updated on Sep 4 2017 1:30 AM

వాలెట్ బ్యాలెన్స్పై 6% వార్షిక లాభం

వాలెట్ బ్యాలెన్స్పై 6% వార్షిక లాభం

మోబిక్విక్ సంస్థ యూజర్ల వాలెట్ బ్యాలెన్స్‌పై 6 శాతం వార్షిక లాభాన్ని అందించనున్నది.

మోబిక్విక్ ఆఫర్

 హైదరాబాద్: మోబిక్విక్ సంస్థ యూజర్ల వాలెట్ బ్యాలెన్స్‌పై 6 శాతం వార్షిక లాభాన్ని అందించనున్నది. యూజర్లు... తమ వాలెట్ బ్యాలన్స్‌పై 6 శాతం వార్షిక లాభాన్ని పొందే ఆఫర్ భారత్‌లో తామే తొలిసారిగా ఆఫర్ చేస్తున్నామని భారతదేశపు అతి పెద్ద మొబైల్ చెల్లింపుల నెట్‌వర్క్ మోబిక్విక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ 6 శాతం వార్షిక లాభం పొందాలంటే యూజర్లు నెలకు కనీసం రూ.5,000 లేదా అంతకుమించిన బ్యాలెన్స్‌ను వాలెట్‌లో నిర్వహించాల్సి ఉంటుందని మోబిక్విక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఉపాసన తకు పేర్కొన్నారు.

ఏడాదికి 250 శాతం చొప్పున వృద్ధి సాధిస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి తమ యూజర్ల సంక్య ఏడు లక్షలకు చేరగలదని వివరించారు. సూక్ష్మ రుణాలందించడం, వాలెట్ బ్యాలెన్స్‌పై లాభాలు, నగదు రహిత లావాదేవీలు తదితర సేవల ద్వారా ప్రతి భారతీయుడి ఆర్థిక అవసరాలను తీర్చే డిజిటల్‌సంస్థగా రూపాంతరం చెందుతున్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement