పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ కోత: ధరలు కిందకి | Madhya Pradesh cuts petrol, diesel VAT, new prices from midnight | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ కోత: ధరలు కిందకి

Oct 13 2017 12:19 PM | Updated on Sep 28 2018 3:22 PM

Madhya Pradesh cuts petrol, diesel VAT, new prices from midnight - Sakshi

మరో బీజేపీ పాలిత రాష్ట్రం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించింది. గుజరాత్‌, మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌ అనంతరం మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌ల్‌పై వ్యాట్‌ తగ్గిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. పెట్రోల్‌పై రిటైల్‌ వ్యాట్‌ను 3 శాతం, డీజిల్‌పై రిటైల్‌ వ్యాట్‌ను 5 శాతం తగ్గిస్తున్నట్టు మధ్య ప్రదేశ్‌ సీఎం శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహన్‌ తెలిపారు. ఈ తగ్గించిన వ్యాట్‌ ప్రకారం కొత్త ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను కొంత నిరోధించడానికి ఎక్సైజ్‌ డ్యూటి వీటిపై లీటరు రూ.2 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.

ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు అనంతరం రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను 5 శాతం మేర తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల సీఎంలను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రాలు కూడా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌లో కోతపెడుతున్నాయి. కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించడంతో మూడు నెలలుగా భారీగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి వినియోగదారులకు కొంత ఊరట లభించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తూ ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement