జేఎల్‌ఆర్ ‘డిస్కవరీ స్పోర్ట్’లో పెట్రోల్ వేరియంట్ | JLR bets on petrol, launches Discovery Sport variant at Rs 56L | Sakshi
Sakshi News home page

జేఎల్‌ఆర్ ‘డిస్కవరీ స్పోర్ట్’లో పెట్రోల్ వేరియంట్

Jun 21 2016 12:47 AM | Updated on Sep 4 2017 2:57 AM

జేఎల్‌ఆర్ ‘డిస్కవరీ స్పోర్ట్’లో పెట్రోల్ వేరియంట్

జేఎల్‌ఆర్ ‘డిస్కవరీ స్పోర్ట్’లో పెట్రోల్ వేరియంట్

దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్).. పెట్రోల్ వేరియంట్లపై...

ప్రారంభ ధర రూ.56.50 లక్షలు
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్).. పెట్రోల్ వేరియంట్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తాజాగా తన ప్రముఖ ఎస్‌యూవీ ‘లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్’లో 2.0 లీటర్ పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ.56.50 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఇది కేవలం హెచ్‌ఎస్‌ఈ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండనున్నది.

కంపెనీ గతేడాదే డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో డిస్కవరీ స్పోర్ట్ మోడల్‌ను భారత్‌లోకి తీసుకువచ్చింది. డీజిల్ వేరియంట్‌లో ఏవైతే ఫీచర్లు ఉన్నాయో.. కొత్త వేరియంట్‌లోనూ అవే ప్రత్యేకతలు ఉన్నాయి. ఎలాంటి మార్పులు లేవు.

Advertisement
 
Advertisement
Advertisement