చైనాలో తగ్గిన ఐఫోన్‌11 అమ్మకాలు

iPhone11 Hit Stores In China To No Crowds - Sakshi

చైనా: అమెరికా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఆపిల్‌కు చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల సెగ బాగా తగులుతోంది.  ఈ క్రమంలోనే మొబైల్‌ రంగంలో విప్లవం సృష్టించిన యాపిల్‌ ఐఫోన్‌ హువావే రాకతో కాస్త తడబడినట్లు తెలుస్తోంది. శుక్రవారం చైనీస్‌ మార్కెట్లో విడుదలయిన ఐఫోన్‌11 అమ్మకాలలో కాస్త వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. చైనా చవక బ్రాండ్లయిన వివో, ఒప్పోలు ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో ప్రభావం చూపుతున్నా యాపిల్‌ అమ్మకాలు పడిపోవడానికి హువావే ముఖ్యకారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, న్యూషిప్‌మెంట్‌ రిపోర్ట్‌  2019 ప్రకారం మొదటి క్వార్టర్‌లో యాపిల్‌ అమ్మకాలు చైనాలో 30శాతం మేర తగ్గినట్లు నివేదిక స్పష్టం చేస్తుంది. 

ప్రస్తుత పరిస్థితులలో యాపిల్‌ పుంజుకోవాలంటే హోలోగ్రామ్‌ ఫోన్‌ లేదా 5జీ నెటవర్క్‌ అందుబాటులోకి తీసుకొస్తేనే మునపటి మాదిరి అమ్మకాలు కొనసాగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చైనాలో ఐఫోన్‌ మందగమనానికి అమెరికా, చైనా వాణిజ్యపరమైన యుద్ధాలు ఒక కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనీయులు లోకల్‌ బ్రాండయిన హువాయ్‌వైపే మొగ్గు చూపుతున్నారని, అయితే 5జీ వస్తే యాపిల్‌ అమ్మకాలు పుంజుకోవచ్చని  ఆర్థిక నిపుణుడు మిశ్రా తెలిపారు.

అయితే చైనా ప్రభుత్వం హువావేనే వాడాలని ఆదేశించడం, సరికొత్త ఫ్యూచర్స్‌తో అలరించడం తదితర పరిణామాలు హువావే పుంజుకోవడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో 30శాతం గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లను చైనా కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలలో 16 శాతం క్షీణతను చెనా ఎదుర్కొంటున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top