చైనాను మించనున్న భారత్ వృద్ధి | India's growth rate may be over come china | Sakshi
Sakshi News home page

చైనాను మించనున్న భారత్ వృద్ధి

Jun 17 2015 1:08 AM | Updated on Sep 3 2017 3:50 AM

చైనాను మించనున్న భారత్ వృద్ధి

చైనాను మించనున్న భారత్ వృద్ధి

ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు చైనాను మించే అవకాశాలు ఉన్నాయని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్ తకహికో నకావో అభిప్రాయపడ్డారు...

ఈ ఏడాది వృద్ధి రేటుపై ఏడీబీ అధ్యక్షుడి అంచనా
న్యూఢిల్లీ:
ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు చైనాను మించే అవకాశాలు ఉన్నాయని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్ తకహికో నకావో అభిప్రాయపడ్డారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగాను, చైనా వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు నకావో పేర్కొన్నారు.  మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్య నాయుడుతో భేటీ అనంత రం విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. 2018 నాటి  కల్లా భారత్‌కిచ్చే రుణాలు దాదాపు 50 శాతం పెంచి 12 బిలియన్ డాలర్లకు చేర్చనున్నట్లు నకావో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement