ఆర్థిక రంగం ముందు సవాళ్లు: సీతారామన్‌

Indian Economy Currently Facing Challenges Says Nirmala Sitharaman - Sakshi

న్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ‘ది రైజ్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌: కాజెస్, కన్‌సీక్వెన్సెస్, క్యూర్‌’ అనే పేరుతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై వి.అనంత నాగేశ్వరన్, గుల్జార్‌ నటరాజన్‌ సంయుక్తంగా రచించిన పుస్తకాన్ని మంత్రి ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం, భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ పుస్తకం పరిష్కారాలను సూచించినట్టు చెప్పారు. ఓ పుస్తకంగా ఇది ఎంతో ప్రాచుర్యం పొందగలదని,  మరీ ముఖ్యంగా.. మనకు  సందర్భోచితంగా ఉండటంతోపాటు సరైన సమయంలో విడుదల చేసినట్టు పేర్కొన్నారు. మందగమనంపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఇది వచ్చినట్టు చెప్పారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top