‘జాబ్స్’ సేవల్లోకి టెస్ట్ మై ఇంటర్వ్యూ! | Image for the news result Think Digital Launches Test My Interview | Sakshi
Sakshi News home page

‘జాబ్స్’ సేవల్లోకి టెస్ట్ మై ఇంటర్వ్యూ!

Mar 8 2016 1:20 AM | Updated on Sep 3 2017 7:12 PM

‘జాబ్స్’ సేవల్లోకి టెస్ట్ మై ఇంటర్వ్యూ!

‘జాబ్స్’ సేవల్లోకి టెస్ట్ మై ఇంటర్వ్యూ!

చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నించే యువతకు... పేరొందిన ఐటీ కంపెనీల ఇంటర్వ్యూ బోర్డు సభ్యులచేతే నమూనా ఇంటర్వ్యూలు చేయిస్తున్న

హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నించే యువతకు... పేరొందిన ఐటీ కంపెనీల ఇంటర్వ్యూ బోర్డు సభ్యులచేతే నమూనా ఇంటర్వ్యూలు చేయిస్తున్న ‘టెస్ట్ మై ఇంటర్వ్యూ’ సంస్థ హైదరాబాద్ జాబ్ మార్కెట్లో తన సేవలు లాంఛనంగా ఆరంభించింది. ఈ తరహా ఇంటర్వ్యూలకు హాజరైన వారు తరవాత అసలు ఇంటర్వ్యూలు ఎదుర్కోవటం ఈజీ అని సంస్థ తెలియజేసింది. ‘‘దిగ్గజ కంపెనీల్లో ఇంటర్వ్యూలు చేసే బోర్డు సభ్యులు, ఆ స్థాయి ఉన్నవారే ఈ నమూనా ఇంటర్వ్యూలు చేస్తారు. దానివల్ల విద్యార్థులు లోటుపాట్లుంటే సరిదిద్దుకోవచ్చు. అసలు ఇంటర్వ్యూను ఈజీగా చెయ్యొచ్చు’’ అని టెస్ట్ మై ఇంటర్వ్యూ డాట్‌కామ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు కె.శ్రీధర్ చెప్పారు.

మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి శ్రీధర్... ఏడాది కిందట దీన్ని ఆరంభించారు. ‘‘విద్యార్థుల్ని ఇంటర్వ్యూ చేసి తుది ఇంటర్వ్యూలు లేదా ఎంపిక నిమిత్తం తమకు పంపించాలని కోరుతూ పలు ఐటీ కంపెనీలు మాకు క్లయింట్లుగా చేరాయి. ఒడిషా సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ఇంజినీరింగ్ కాలేజీలు కూడా తమ విద్యార్థుల్ని ఇంటర్వ్యూలు చేసి సవివరమైన నివేదికలివ్వాలని కోరుతూ మా క్లయింట్లుగా చేరాయి’’ అని శ్రీధర్ వివరించారు. ఇలా విద్యార్థుల్ని గ్రేడింగ్ చేయటం వల్ల... తక్కువ గ్రేడ్ ఉన్న విద్యార్థుల్ని ఆయా కాలేజీలు మరింత సానపడుతున్నాయని, దీనివల్ల మరింత మంది ఆయా కాలేజీల నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అవుతున్నారని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇప్పటికే తాము 15వేల మంది విద్యార్థుల్ని ఇంటర్వ్యూ చేశామని, మోడల్ ఇంటర్వ్యూల కోసం పలువురు ఉద్యోగార్థులు నేరుగా తమ వెబ్‌సైట్‌లోనే రిజిస్టర్ చేసుకుంటున్నారని ఆయన తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement