హెచ్‌టీసీ యు11ప్లస్‌ లాంచ్‌..ధర ఎంత? | HTC U11+ With 6-Inch 18:9 Display Launched in India | Sakshi
Sakshi News home page

హెచ్‌టీసీ యు11ప్లస్‌ లాంచ్‌..ధర ఎంత?

Feb 6 2018 3:01 PM | Updated on Feb 7 2018 8:25 AM

HTC U11+ With 6-Inch 18:9 Display Launched in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  తైవాన్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ హెచ్‌టీసీ  లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ డివైస్‌ను లాంచ్‌ చేసింది. హెచ్‌టీసీ యు 11ప్లస్‌ పేరుతో ఈ  స్మార్ట్‌ఫోన్‌ ఎడ్జ్‌  టు ఎడ్జ్‌ టు డిస్‌ప్లే తో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను  భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.   రేపటినుంచి (ఫిబ్రవరి 7)  ఫ్లిప్‌కార్ట్‌లో  విక్రయానికి ప్రత్యేకంగా లభ్యం కానుంది.  ప్రస్తుతానికి సిల్వర్‌కలర్‌ వేరియంట్‌మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలోనే సెరామిక్‌ బ్లాక్‌ కలర్‌లో కూడా అందుబాటులోఉంటుందని కంపెనీ ప్రకటించింది.  ఇక దీని ధర 56,990 రూపాయలుగా ఉండనుంది. 4జీబీ, 6జీబీ వేరియంట్లలో దీన్ని లాంచ్‌  చేసింది.
 

హెచ్‌టీసీ యు 11ప్లస్‌ ఫీచర్లు
6 అంగుళాల క్వాడ్‌ హెచ్‌డీ  సూపర్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
1440x2880 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌
6జీబీ /128జీబీ స్టోరేజ్‌
12 ఎంపీ అల్ట్రా మెగా పిక్సెల్‌ కెమెరా విత్‌ ఆటో ఫోకస్‌
8ఎంపీ సెల్పీ కెమెరా
3930 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Advertisement
 
Advertisement
Advertisement