హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ పత్రాలు దాఖలు | Hinduja Leyland Finance files IPO papers to mop-up Rs 500 crore | Sakshi
Sakshi News home page

హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ పత్రాలు దాఖలు

Mar 31 2016 2:00 AM | Updated on Oct 2 2018 3:56 PM

హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ పత్రాలు దాఖలు - Sakshi

హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ పత్రాలు దాఖలు

అశోక్ లేలాండ్ అనుబంధ కంపెనీ హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి బుధవారం సమర్పించింది.

కనీసం రూ.500 కోట్లు సమీకరణ లక్ష్యం...

 న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ అనుబంధ కంపెనీ హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి బుధవారం  సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ  రూ.500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీచేయడంతో పాటు ప్రస్తుత షేర్‌హోల్డర్లు 2.66 కోట్ల ఈక్విటీ షేర్లను పబ్లిక్ ఆఫర్లో విక్రయిస్తారు. లేలాండ్ ఫైనాన్స్ సంస్థ వివిధ వాహనాల కొనుగోళ్లకు రుణాలందజేస్తోంది.

 వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఈ ఐపీఓ: బీఎస్‌ఈ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్నది. ఈ ఐపీఓ ద్వారా రూ.800 కోట్లు సమీకరించాలని బీఎస్‌ఈ యోచిస్తోంది. ఈ ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలంలో సెబీకి బీఎస్‌ఈ సమర్పించవచ్చని సమాచారం.

 ఐపీవో బాటలో 23 ఎస్‌ఎంఈలు: దాదాపు 23 చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలు(ఎస్‌ఎంఈ)ఐపీఓ ముసాయిదా పత్రాలను ఈ మార్చి క్వార్టర్లో  సెబీకి సమర్పించాయి.  ఈ సంస్థలు ఐపీఓల ద్వారా రూ200 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి.

 మళ్లీ సీఎల్ ఎడ్యుకేట్ ఐపీఓ: విద్య సంబంధిత సేవలందించే సీఎల్ ఎడ్యుకేట్ కంపెనీ ఐపీఓ పత్రాలను దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ సెబీకి సమర్పించింది.

Advertisement
 
Advertisement
Advertisement