స్లోడౌన్‌ సెగలు లేవు.. | Hardeep Singh Puri Speaks On Indian Economy | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థపై హర్‌దీప్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

Mar 2 2020 6:02 PM | Updated on Mar 2 2020 7:30 PM

Hardeep Singh Puri Speaks On Indian Economy  - Sakshi

పుణె: దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్న వాదనతో తాను ఏకీభవించడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు.దేశంలో రవాణా రంగం, పౌర విమానయాన రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కాగా ఆటోమొబైల్‌ రంగంలో వృద్ధి నెమ్మదించినా, ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి ఆటోమొబైల్‌ రంగం ఒక్కటే కొలమానం కాదన్నారు.  పౌర విమానయాన రంగంలో వృద్ధి తగ్గిందన్న వార్తలను ఆయన ఖండించారు. ప్రపంచంలోనే దేశీయ పౌర విమానయాన రంగం మూడో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలిపారు. వృద్ధి రేటు పుంజుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు  చేపట్టిందని, రవాణా రంగాన్ని వేగంగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు.

చదవండి: ఒక లీటర్ తాగి చెప్పండి..ఎలా ఉందో..!

 

Advertisement
 
Advertisement
Advertisement