మార్కెట్లోకి జిల్లెట్‌ వీనస్‌ బ్రీజ్‌ | Gillette Venus released by Kajal Agarwal | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి జిల్లెట్‌ వీనస్‌ బ్రీజ్‌

Mar 4 2017 7:35 PM | Updated on Oct 30 2018 5:58 PM

మార్కెట్లోకి జిల్లెట్‌ వీనస్‌ బ్రీజ్‌ - Sakshi

మార్కెట్లోకి జిల్లెట్‌ వీనస్‌ బ్రీజ్‌

రేజర్స్‌ ఉత్పత్తి రంగంలో రాణిస్తున్న జిల్లెట్‌ కొత్తగా మార్కెట్లోకి వీనస్‌ బ్రీజ్‌ను ప్రవేశపెట్టింది.

చెన్నై:
రేజర్స్‌ ఉత్పత్తి రంగంలో రాణిస్తున్న జిల్లెట్‌ కొత్తగా మార్కెట్లోకి వీనస్‌ బ్రీజ్‌ను ప్రవేశపెట్టింది. నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటి కాజల్‌ అగర్వాల్‌ దీనిని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. పర్పుల్‌ డాట్‌కామ్‌ ప్రస్తుతం జిల్లెట్‌ విమెన్‌ రేజర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ రేజర్స్‌ ద్వారా మహిళలు అవాంచిత రోమాలను తొలగించుకునేందుకు వీలుకలుగుతున్నట్లు పర్పుల్‌ డాట్‌కామ్, కో–ఫౌండర్, సీఈఓ మనీష్‌ తనేజా తెలిపారు. ఈ రేజర్‌ ఐకానిక్‌ మాయిశ్చర్‌ జెల్‌ బార్స్‌తో, సెక్యూర్‌ గ్రిప్, ఒన్‌ స్ట్రోక్‌ షేవింగ్, హ్యాండ్లింగ్‌కు అనువుగా ఉన్నట్లు తెలిపారు. ఇవి చర్మానికి ఎటువంటి హాని కలిగించవని పేర్కొన్నారు. తమ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్టు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement