breaking news
Gillette Venus
-
జిల్లెట్ రేజర్లు వాడుతున్నారా..?
సాధారణంగా కొన్ని రకాల మందులు, భద్రతా కారణాల రీత్యా ఆటో కంపెనీలు, లేదా ఫుడ్ ఉత్పతుల రీకాల్‌ను చూస్తుంటాం. కానీ రేజర్లు రీకాల్స్ చేయడం చాలా అరుదు. అయితే షేవింగ్ బ్లేడ్స్, షేవింగ్ క్రీమ్ తయారీ దిగ్గజ సంస్థ జిల్లెట్ తాజాగా భారీ సంఖ్యలో రేజర్లను రీకాల్ చేస్తోంది. మరీ పదునుగా ఉన్నాయనీ, తద్వారా తెగి పోవడం, లోతైన గాయం అయ్యే అవకాశం ఉందంటూ రెండు ఉత్సత్తులను వెనక్కి తీసుకుంటోంది. వీనస్ సింప్లీ 3 డిస్పోజబుల్ రేజర్ 4-ప్యాక్, డైసీ క్లాసిక్ 12 + 1 వీనస్ సింప్లీ 3 బోనస్ ప్యాక్ ఇందులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. మరీ ఎక్కువ షార్ప్‌గా ఉన్నాయంటూ 87వేల డిస్పోజబుల్ రేజర్లను జిల్లెట్ రీకాల్ చేస్తోంది. తయారీలో లోపం కారణంగా రేజర్‌లోని బ్లేడ్ల అమరిక తప్పుగా ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మే నెలల మధ్య విక్రయించిన ఉత్పత్తులు ప్రభావితమయ్యాయని వాటిని వెనక్కి తీసుకుంటామని తెలిపింది. ఈ రేజర్లను ఉపయోగించడాన్ని వెంటనే ఆపివేసి, వాటిని జిల్లెట్‌కు అందించి రీప్లేస్మెంట్ వోచర్ తీసుకోవాలని వినియోగదారులకు సూచిస్తోంది. లక్షలాది మంది మహిళల భద్రత, వారి విశ్వాసమే తమకు ముఖ్యమని జిల్లెట్ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలు జిల్లెట్ అధికారిక వెబ్సైట్లో లభ్యం. -
మార్కెట్లోకి జిల్లెట్ వీనస్ బ్రీజ్
చెన్నై: రేజర్స్ ఉత్పత్తి రంగంలో రాణిస్తున్న జిల్లెట్ కొత్తగా మార్కెట్లోకి వీనస్ బ్రీజ్‌ను ప్రవేశపెట్టింది. నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటి కాజల్ అగర్వాల్ దీనిని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. పర్పుల్ డాట్‌కామ్ ప్రస్తుతం జిల్లెట్ విమెన్ రేజర్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రేజర్స్ ద్వారా మహిళలు అవాంచిత రోమాలను తొలగించుకునేందుకు వీలుకలుగుతున్నట్లు పర్పుల్ డాట్‌కామ్, కో–ఫౌండర్, సీఈఓ మనీష్ తనేజా తెలిపారు. ఈ రేజర్ ఐకానిక్ మాయిశ్చర్ జెల్ బార్స్‌తో, సెక్యూర్ గ్రిప్, ఒన్ స్ట్రోక్ షేవింగ్, హ్యాండ్లింగ్‌కు అనువుగా ఉన్నట్లు తెలిపారు. ఇవి చర్మానికి ఎటువంటి హాని కలిగించవని పేర్కొన్నారు. తమ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్టు తెలిపారు.