జిల్లెట్‌ రేజర్లు వాడుతున్నారా..?

Gillette Recalls Over 87,000 Razors For Being Too Sharp - Sakshi

 జిల్లెట్‌ రేజర్ల భారీ రీకాల్‌

 మరీ పదునుగా ఉన్నాయంటూ వీనస్‌  డిస్పోజబుల్‌ రేజర్లు  వెనక్కి

సాధారణంగా  కొన్ని రకాల మందులు, భద్రతా కారణాల రీత్యా ఆటో కంపెనీలు, లేదా ఫుడ్‌ ఉత్పతుల రీకాల్‌ను చూస్తుంటాం. కానీ రేజర్లు రీకాల్స్‌ చేయడం చాలా అరుదు. అయితే షేవింగ్ బ్లేడ్స్, షేవింగ్ క్రీమ్ తయారీ దిగ్గజ సంస్థ జిల్లెట్‌  తాజాగా  భారీ సంఖ్యలో రేజర్లను రీకాల్‌ చేస్తోంది. మరీ పదునుగా ఉన్నాయనీ, తద్వారా తెగి పోవడం, లోతైన గాయం అయ్యే అవకాశం ఉందంటూ రెండు ఉత్సత్తులను వెనక్కి తీసుకుంటోంది. వీనస్ సింప్లీ 3 డిస్పోజబుల్ రేజర్ 4-ప్యాక్,  డైసీ క్లాసిక్‌ 12 + 1 వీనస్‌ సింప్లీ 3 బోనస్ ప్యాక్ ఇందులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. 

మరీ  ఎక్కువ షార్ప్‌గా ఉన్నాయంటూ  87వేల డిస్పోజబుల్‌ రేజర్లను జిల్లెట్‌  రీకాల్‌ చేస్తోంది. తయారీలో లోపం కారణంగా రేజర్‌లోని బ్లేడ్‌ల అమరిక తప్పుగా ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది  జనవరి-మే నెలల మధ్య విక్రయించిన ఉత్పత్తులు ప్రభావితమయ్యాయని వాటిని వెనక్కి తీసుకుంటామని తెలిపింది. ఈ రేజర్‌లను ఉపయోగించడాన్ని వెంటనే ఆపివేసి, వాటిని జిల్లెట్‌కు అందించి రీప్లేస్‌మెంట్‌ వోచర్‌ తీసుకోవాలని వినియోగదారులకు సూచిస్తోంది.  లక్షలాది మంది మహిళల భద్రత,  వారి విశ్వాసమే తమకు ముఖ్యమని  జిల్లెట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  మరిన్ని వివరాలు  జిల్లెట్‌  అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top