ఆర్థికమంత్రి  సీతారామన్‌ మీడియా సమావేశం

FM Sitharaman press conference  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌  శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికంటే  ముందు ఆమె వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాడ్లాడుతూ  5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సాధనలో భాగంగా కొన్ని చర్యలు చేపట్టన్నుట్టు చెప్పారు.

ముఖ్యాంశాలు

 • ఆర్థిక నేరగాళ్లను కట్టడి చేయడానికి బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు కొనసాగిస్తాం.
 • ఇక మీదట ప్రభుత్వ బ్యాంకుల్లో ఎగ్జిక్యూటివ్‌లకు సంబంధించి కొత్త నియామక పద్ధతులను అవలబించనున్నాం.
 • బ్యాంకుల నిరర్ధక ఆస్తులు గణనీయంగా తగ్గాయి. 
 • గృహ రుణాల విధానాన్ని ఇంకా సరళీకరణ చేస్తాం. మరింత మందివినియోగదారులకు  ఈ  రుణాలను అందుబాటులోకి తీసుకోవాలనేది ప్రణాళిక
 • రుణాల రికవరీ శాతం బాగా పుంజుకుంది. దీంతో 14 ప్రభుత్వ బ్యాంకు లాభాల బాటలో ఉన్నాయి.
 • పీఎన్‌బీ, ఓబీసీ, యునైటెడ్‌ బ్యాంకుల విలీనం. 11437 బ్రాంచిలతో  దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకుగా  విలీన బ్యాంకు ఆవిష్కారం 
 • భారీగా  ప్రభుత్వ బ్యాంకుల విలీనం , 27 నుంచి 12కు ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య
  యూనియన్ బ్యాంకు‌, ఆంధ్ర, కార్పొరేషన్‌ బ్యాంకులు మెర్జర్‌
  కెనరా, సిండికేట్‌ బ్యాంకులు విలీనం
  ఇండియన్‌ బ్యాంకు, అలహా బాదు బ్యాంకులు విలీనం
 • బ్యాంకు బోర్డులు పటిష్టం, మరిన్ని అధికారులు 
  స్పెషలైజ్‌డ్‌ రిస్క్‌ ఆఫీసర్ల నియామకం వీరికి  జీతాలు ప్రభుత్వం చెల్లించదు. నాన్‌అఫీషయల్‌ డైరెక్టర్ల సిటింగ్‌ ఫీజును  బోర్డులే నిర్ణయిస్తాయి. 
 • ఈ విలీనం ద్వారా  ఉద్యోగాల్లో ఎలాంటి తొలగింపులు వుండవు.

కాగా ప్రభుత్వరంగ బ్యాంకుల కన్సాలిడేషన్ మెగా ప్లాన్‌, అలాగే 2-3 బ్యాంకులను విలీనం చేయడం ద్వారా కొన్ని పెద్ద బ్యాంకులను సృష్టించాలన్న ప్రకటనను ప్రభుత్వం ప్రకటిస్తుందనే అంచనాల మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. మరో రెండు రోజుల్లో కీలక విధానాన్ని ప్రకటించనున్నట్లు నిర్మల సీతారామన్ గురువారం చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేం‍ద్రమంత్రి  సీతారామన్ 70,000 కోట్ల రూపాయల తక్షణ బ్యాంక్ రీకాపిటలైజేషన్‌ను ప్రకటించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top