రూ.646 కోట్ల ఫేస్బుక్ షేర్ల విక్రయం | Facebook may start flagging fake news posts, says Mark Zuckerberg | Sakshi
Sakshi News home page

రూ.646 కోట్ల ఫేస్బుక్ షేర్ల విక్రయం

Nov 23 2016 1:04 AM | Updated on Jul 26 2018 12:41 PM

రూ.646 కోట్ల ఫేస్బుక్ షేర్ల విక్రయం - Sakshi

రూ.646 కోట్ల ఫేస్బుక్ షేర్ల విక్రయం

ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ 9.5 కోట్ల డాలర్ల (రూ.646 కోట్లు)విలువైన ఫేస్‌బుక్ షేర్లను విక్రరుుంచారు.

దాతృత్వ కార్యక్రమాల కోసం...
న్యూయార్క్: ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ 9.5 కోట్ల డాలర్ల (రూ.646 కోట్లు)విలువైన ఫేస్‌బుక్ షేర్లను విక్రరుుంచారు. కంపెనీ వాటాలో 99 శాతం షేర్లను దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించాలన్న నిర్ణయంలో భాగంగా ఈ వాటా షేర్ల విక్రయం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 19 కోట్ల డాలర్లు, అక్టోబర్‌లో కూడా ఇదే స్థారుులో ఫేస్‌బుక్ షేర్లను దాతృత్వ కార్యక్రమాల కోసం విక్రరుుంచారు. జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్‌లు దాతృత్వ కార్యకలాపాల కోసం గత ఏడాది రెండు సంస్థలను- ది చాన్ జుకర్‌బర్గ్ ఫౌండేషన్,  సీజడ్‌ఐ హోల్డింగ్‌‌స ఎల్‌ఎల్‌సీలను ఏర్పాటు చేశారు. కంపెనీ వాటాలో 99 శాతం వాటాను దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వనున్నామని గత ఏడాది డిసెంబర్‌లో జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement