‘గ్రేడ్‌ అప్‌’తో ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ ఈజీ | Entrance exams with Grade Up are easy | Sakshi
Sakshi News home page

‘గ్రేడ్‌ అప్‌’తో ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ ఈజీ

Mar 16 2019 1:18 AM | Updated on Mar 16 2019 1:18 AM

Entrance exams with Grade Up are easy - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘‘దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌ స్టార్టప్‌ ‘గ్రేడ్‌ అప్‌’.. త్వరలోనే ఒలంపియాడ్, నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ (ఎన్‌టీఎస్‌ఈ) వంటి స్కూల్‌ లెవల్‌ జాతీయ ప్రవేశ పరీక్షల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. పాఠశాల ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ సిలబస్, మోడల్‌ పేపర్స్, లైవ్‌ క్లాసెస్, మాక్‌ టెస్ట్‌ల వంటి కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మరిన్ని వివరాలు గ్రేడ్‌ అప్‌ కో–ఫౌండర్‌ శోభిత్‌ భట్నాగర్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. దేశంలో ఏటా 3 కోట్ల మంది విద్యార్థులు వివిధ రకాల ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాల పోటీ పరీక్షలు కావచ్చు. పై చదువుల ప్రవేశ పరీక్షలు కావచ్చు.. ఏవైనా సరే ఎగ్జామ్స్‌ ప్రిపరేషన్‌ ఎంత ముఖ్యమో కంటెంట్‌ అందుబాటులో ఉండటమూ అంతే ముఖ్యం. విద్యార్థులకు ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ను సులభతరం చేయడమే లక్ష్యంగా 2015 సెప్టెంబర్‌లో రూ.15 లక్షల పెట్టుబడితో నోయిడా కేంద్రంగా సంజీవ్‌ కుమార్, విభు భూషణ్‌లతో కలిసి గ్రేడ్‌ అప్‌ను ప్రారంభించాం.

50కి పైగా ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌..
ప్రస్తుతం ఐఐటీ, జేఈఈ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్‌సీ, బ్యాంకింగ్‌ వంటి 50కి పైగా ప్రవేశ పరీక్షల కంటెంట్‌ అందుబాటులో ఉంది. ఆయా ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ మెటీరియల్స్, మోడల్, ప్రాక్టీస్‌ పేపర్స్‌ వంటివన్నీ ఉంటాయి. అన్నీ ఉచితమే. ప్రస్తుతం ప్రవేశ పరీక్షల కంటెంట్‌ ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఏడాదిలో తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం.

హైదరాబాద్‌ వాటా 30 శాతం..
ప్రస్తుతం 2500 నగరాల నుంచి 1.3 కోట్ల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇందులో పెయిడ్‌ యూజర్లు 2.5 లక్షల మంది ఉంటారు. హైదరాబాద్‌ వాటా 30 శాతం ఉంటుంది. ప్రస్తుతం నెలకు 25 లక్షల మంది విద్యార్థులు మా సేవలను వినియోగించుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి గేట్, ఇంజనీరింగ్‌ వంటి టెక్నికల్‌ సబ్జెక్టŠస్‌కు సంబంధించిన ప్రవేశ పరీక్ష విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు.

లైవ్‌ క్లాస్‌లు, మాక్‌ టెస్ట్‌లు..
మాక్‌ టెస్ట్‌లు, లైవ్‌ క్లాస్‌లు మాకు ఆదాయ మార్గాలు. మాక్‌ టెస్ట్‌ ధరలు రూ.200–1000, లైవ్‌ క్లాస్‌లకు రూ.300–20 వేల వరకున్నాయి. ఏడాదిలో మూడింతలు ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. కంటెంట్‌ ప్రిపరేషన్‌ కోసం ఆయా విభాగాల్లో పదిహేనేళ్ల అనుభవం ఉన్న 60 మంది నిపుణులున్నారు. ఫ్రీనాల్సర్స్‌గా మరొక 300 మందితో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే లా, నీట్, సీటీఈటీ, ఆర్‌ఆర్‌బీ కంటెంట్‌ను జోడించనున్నాం. వచ్చే ఏడాది కాలంలో 7 లక్షల మంది పెయిడ్‌ యూజర్లకు చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ఇప్పటివరకు గ్రేడ్‌ అప్‌లో 60 లక్షల పరీక్షలు నిర్వహించాం.

ఈ ఏడాది రూ.100 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం మా కంపెనీలో 150 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో మరొక 50 మందిని నియమించుకుంటాం. గత రెండున్నరేళ్లలో నాలుగు రౌండ్లలో కలిపి ఢిల్లీకి చెందిన పలువురు ఇన్వెస్టర్లు రూ.47 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ముగింపుకు రూ.100 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పాత ఇన్వెస్టర్లతో పాటు  విదేశీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయని’’ శోభిత్‌ వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement