కోటి కొత్త డీటీహెచ్ కస్టమర్లు | Crore new customers for DTH players | Sakshi
Sakshi News home page

కోటి కొత్త డీటీహెచ్ కస్టమర్లు

Jul 21 2015 2:22 AM | Updated on Sep 3 2017 5:51 AM

కోటి కొత్త డీటీహెచ్ కస్టమర్లు

కోటి కొత్త డీటీహెచ్ కస్టమర్లు

డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో 2015-16లో కొత్తగా ఒక కోటి మంది కస్టమర్లు వచ్చి చేరతారని టాటా స్కై అంచనా వేస్తోంది...

- ఈ ఏడాది డీటీహెచ్ రంగం జోరు..
- ప్రతి ముగ్గురు వినియోగదార్లలో ఒకరు టాటా స్కై నుంచే...
- కంపెనీ సీఎస్‌వో సలీమ్ షేక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో 2015-16లో కొత్తగా ఒక కోటి మంది కస్టమర్లు వచ్చి చేరతారని టాటా స్కై అంచనా వేస్తోంది. నాణ్యమైన దృశ్యం, ఉత్తమ సర్వీసు, ఎంపిక చేసుకోవడానికి విభిన్నమైన ప్యాక్‌ల కారణంగా డీటీహెచ్‌ను ఎంచుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని టాటా స్కై చీఫ్ సేల్స్ ఆఫీసర్ సలీమ్ షేక్ సోమవారం తెలిపారు. ‘దేశవ్యాప్తంగా 14 కోట్ల టీవీ గృహాలున్నాయి. కేబుల్ చందాదారులు 8-8.5 కోట్లు, డీటీహెచ్ చందాదారులు 4.1 కోట్ల మంది ఉన్నారు. కేబుల్ నుంచి డీటీహెచ్‌కు మళ్లుతున్నవారి శాతం ఏటా 6-8 శాతంగా ఉంది. డిజిటైజేషన్‌కు అనుగుణంగా ఇది మరింత పెరుగుతుంది’ అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు పరిశ్రమ 10-12% న మోదు చేస్తే, టాటా స్కై 20% అంచనా వేస్తోందన్నారు.  
 
కొత్త కస్టమర్లలో..
డీటీహెచ్ రంగంలో కొత్తగా వచ్చి చేరుతున్న కస్టమర్లలో ముగ్గురిలో ఒకరు టాటా స్కై ఎంచుకుంటున్నారని సలీమ్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పట్టణాల్లో 40 శాతంపైగా మార్కెట్ వాటా సాధించామని చెప్పారు. ఇక కొత్త కస్టమర్లలో హెచ్‌డీ కోరుకునేవారు పరిశ్రమలో 15%కాగా, టాటా స్కై విషయంలో 40-45% ఉంటున్నారని తెలిపారు. సర్వీసింగ్‌కు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ, ఏపీలో అగ్రశ్రేణి కంపెనీగా నిలిచిన సందర్భంగా జరిగిన వేడుకలో బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు మహేశ్ బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement