breaking news
DTH players
-
కోటి కొత్త డీటీహెచ్ కస్టమర్లు
- ఈ ఏడాది డీటీహెచ్ రంగం జోరు.. - ప్రతి ముగ్గురు వినియోగదార్లలో ఒకరు టాటా స్కై నుంచే... - కంపెనీ సీఎస్‌వో సలీమ్ షేక్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో 2015-16లో కొత్తగా ఒక కోటి మంది కస్టమర్లు వచ్చి చేరతారని టాటా స్కై అంచనా వేస్తోంది. నాణ్యమైన దృశ్యం, ఉత్తమ సర్వీసు, ఎంపిక చేసుకోవడానికి విభిన్నమైన ప్యాక్‌ల కారణంగా డీటీహెచ్‌ను ఎంచుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని టాటా స్కై చీఫ్ సేల్స్ ఆఫీసర్ సలీమ్ షేక్ సోమవారం తెలిపారు. ‘దేశవ్యాప్తంగా 14 కోట్ల టీవీ గృహాలున్నాయి. కేబుల్ చందాదారులు 8-8.5 కోట్లు, డీటీహెచ్ చందాదారులు 4.1 కోట్ల మంది ఉన్నారు. కేబుల్ నుంచి డీటీహెచ్‌కు మళ్లుతున్నవారి శాతం ఏటా 6-8 శాతంగా ఉంది. డిజిటైజేషన్‌కు అనుగుణంగా ఇది మరింత పెరుగుతుంది’ అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు పరిశ్రమ 10-12% న మోదు చేస్తే, టాటా స్కై 20% అంచనా వేస్తోందన్నారు. కొత్త కస్టమర్లలో.. డీటీహెచ్ రంగంలో కొత్తగా వచ్చి చేరుతున్న కస్టమర్లలో ముగ్గురిలో ఒకరు టాటా స్కై ఎంచుకుంటున్నారని సలీమ్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పట్టణాల్లో 40 శాతంపైగా మార్కెట్ వాటా సాధించామని చెప్పారు. ఇక కొత్త కస్టమర్లలో హెచ్డీ కోరుకునేవారు పరిశ్రమలో 15%కాగా, టాటా స్కై విషయంలో 40-45% ఉంటున్నారని తెలిపారు. సర్వీసింగ్‌కు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ, ఏపీలో అగ్రశ్రేణి కంపెనీగా నిలిచిన సందర్భంగా జరిగిన వేడుకలో బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు మహేశ్ బాబు పాల్గొన్నారు. -
వీడియోకాన్ డీ2హెచ్ ఆదాయం 33 శాతం అప్
హైదరాబాద్: డెరైక్ట్ టు హోమ్(డీటీహెచ్) రంగంలో సేవలందించే వీడియోకాన్ డీ2హెచ్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,338 కోట్ల నిర్వహణ ఆదాయం ఆర్జించింది. ఇది అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నిర్వహణ ఆదాయం కంటే 33 శాతం అధికమని వీడియోకాన్ డీ2హెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. చందా ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.2,058 కోట్లకు చేరిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సౌరభ్ ధూత్ పేర్కొన్నారు. ఇబిటా 55 శాతం వృద్ధితో రూ.609 కోట్లకు చేరిందని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో విజయవంతగా తమ కంపెనీ లిస్ట్ అయిందని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి అంచనాలు జోరుగా ఉన్నాయని, భవిష్యత్తులో మీడియా రంగం మంచి అభివృద్ధిని సాధిస్తుందని కంపెనీ సీఈఓ అనిల్ ఖేరా తెలిపారు. టీవీల విస్తరణ, హెచ్డీ వినియోగం పెరుగుతుండడం వంటి కారణాల వల్ల రాబడులు పెరుగుతాయన్నారు.