ఏపీ, ఒడిశాలలో అపారమైన బాక్సైట్ నిక్షేపాలు | Bauxite deposits in AP,Odisha | Sakshi
Sakshi News home page

ఏపీ, ఒడిశాలలో అపారమైన బాక్సైట్ నిక్షేపాలు

Nov 28 2014 1:07 AM | Updated on Sep 2 2017 5:14 PM

ఏపీ, ఒడిశాలలో అపారమైన బాక్సైట్ నిక్షేపాలు

ఏపీ, ఒడిశాలలో అపారమైన బాక్సైట్ నిక్షేపాలు

‘దేశంలో మరెక్కడా లేనన్ని బాక్సైట్ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా లలోనే ఉన్నాయి.

 సాక్షి, విశాఖపట్నం: ‘దేశంలో మరెక్కడా లేనన్ని బాక్సైట్ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా లలోనే ఉన్నాయి. ఒక్క ఏపీలోనే ఏడాదికి ఐదు మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు వెలికితీసే అవకాశాలున్నాయి. అల్యూమినియం పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ రెండు రాష్ట్రాలు ఎంతో అనువుగా ఉన్నాయని’ ఇంటర్నేషనల్ బాక్సైట్ అల్యూమిన అండ్ అల్యూమినియం సొసైటీ (ఐబాస్) ప్రతినిధులు పలువురు అంతర్జాతీయ అల్యూమినియం ఇండస్ట్రీ నిపుణులు పేర్కొన్నారు.

ఐబాస్-2014 మూడవ అంతర్జాతీయ సదస్సును గురువారం విశాఖలో జేఎన్‌ఎఆర్‌డీడీసీ (జవహర్‌లాల్ అల్యూమినా రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ డిజైన్ సెంటర్) డెరైక్టర్ అనుపమ అగ్నిహోత్రి ప్రారంభించారు. సదస్సులో  వేదాంత రీసోర్సెస్ పిఎల్‌సీ సీఈఒ టామ్ అల్బెనెసే మాట్లాడుతూ ఇండియాలోని అల్యూమినియం ఇండస్ట్రీస్‌లో సమీప భవిష్యత్‌లో లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా ప్రత్యక్షంగా 30వేల మందికి,పరోక్షంగా మరో మూడులక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రానున్న 10-15ఏళ్లలో 20 బిలియన్ నుంచి 25 బిలియన్ డాలర్ల మేర వ్యాపారం జరుగు తుందన్నారు.

 బాక్సైట్ తవ్వకాలు జరిపితే పెనుముప్పు వాటిల్లుతుందంటూ తప్పుడు ప్రచారం సాగుతోందని, ఐరన్‌ఓర్, లాటరైట్ గనుల తవ్వకాలకు ఎదురుకాని వ్యతిరేకత బాక్సైట్ తవ్వకాల విషయంలో ఎందుకు వస్తుందో అర్ధం కావడం లేదన్నారు. ఐబాస్ అధ్యక్షుడు వినోద్ సూద్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన బాక్సైట్‌నిక్షేలాలు ఇక్కడే ఉన్నాయన్నారు. వీటిని వెలికి తీసి సద్వినియోగం చేయగిలిగితే 2020లో అల్యూమినియం పరిశ్రమలో మనదేశం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఐబాస్ ఉపాధ్యక్షుడు, అనరాక్ అల్యూమినియం అధ్యక్షులు హరిహరన్ మహాదేవన్ మాట్లాడుతూ రెడ్‌మడ్,ఈకోలాజికల్ సమస్యలను బూచిగా పరిశ్రమ అభివృద్ధిని అడ్డుకోవడం సమంజసంకాదన్నారు. సరైన రక్షణ చర్యలుతీసుకుంటే ఎలాంటి ముప్పు లేదన్నారు.

మైనింగ్ తర్వాత కూడా ఆ ప్రాంతంలో పంటలు పండించుకునేఅవకాశం ఉందన్నారు. గ్రౌండ్ వాటర్ కుముప్పూ వాటిల్లదన్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాలకు చెందిన అల్యూమినియం ఇండస్ట్రీ తమ దేశాల్లో జరుగుతున్న తవ్వకాలు, ఉత్పత్తులు, విక్రయాలకు సంబంధించి ప్రత్యేకస్టాల్స్ ఏర్పాటుచేసారు. తొలి సదస్సు చైనాలో జరగ్గా రెండవ  సదస్సు కోల్‌కత్తాలో జరిగింది. విశాఖలో సదస్సులో దేశ విదేశాల నుంచి 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement