నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి! | Bank employees strike postponed | Sakshi
Sakshi News home page

నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి!

Jul 12 2016 8:41 AM | Updated on Sep 4 2017 4:37 AM

నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి!

నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి!

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మంగళ, బుధ వారాల్లో తలపెట్టిన సమ్మె వాయిదాపడింది.

- నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి!
- ఢిల్లీ హైకోర్టు జోక్యంతో సమ్మె నిలుపుదల

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మంగళ, బుధ వారాల్లో తలపెట్టిన సమ్మె వాయిదాపడింది. సమ్మెను నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులివ్వటంతో యూనియన్లు సమ్మెను వాయిదా వేశాయి. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులు వేసిన రిట్ పిటీషన్ మీద విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఎస్‌బీహెచ్ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో సమ్మె వాయిదా పడినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) కార్యదర్శి బీఎస్ రాంబాబు చెప్పారు.
 
ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏఐబీఈఏ ఈ నెల 12 (నేడు), 13న (రేపు) సమ్మెకు పిలుపునివ్వడం తెలిసిందే. డిమాండ్లపై జరిపిన చర్చల్లో యాజమాన్యాలు నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ తేకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సమ్మె జరపాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అయితే, ఈలోగా న్యాయస్థానం ఆదేశాలు వెలువడటంతో వాయిదా వేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement