ఒక‍్కరోజే రూ 1100 ఎగిసిన పసిడి..

Analysts Are Betting That Gold Prices May Further Go Up - Sakshi

ముంబై : బంగారం ధరలు రోజురోజుకూ సరికొత్త గరిష్టస్దాయిలకు చేరుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్లలో గోల్డ్‌ మెరుపులకు తోడు డాలర్‌తో రూపాయి మారకం క్షీణతతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు ఎగబాకాయి. ఎంసీఎక్స్‌లో సోమవారం పదిగ్రాముల బంగారం ఏకంగా రూ 1100 భారమై ఏకంగా రూ 43,771 పలికింది. గత వారంలో పదిగ్రాముల బంగారం 1800 పెరగ్గా, ఈ ఒక్కరోజే ఈస్ధాయిలో పెరగడం విశేషం. కరోనా వైరస్‌ విశ్వవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించడంతో మదుపరులు సురక్షిత సాధనంగా బంగారంపై పెట్టుబడులు పెట్టడంతో యల్లో మెటల్‌ ధరలు ఎగబాకుతున్నాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు చుక్కలు చూపుతున్న వెండి సైతం ఎంసీఎక్స్‌లో కిలో రూ 49,081 పలికింది. 

చదవండి : రేసుగుర్రంలా దూసుకెళ్లిన పసిడి..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top