విశాఖలో సౌత్ఇండియా షాపింగ్మాల్ ప్రారంభం | Akhil, Samantha South India Shopping Mall Launch in jagadamba centre | Sakshi
Sakshi News home page

విశాఖలో సౌత్ఇండియా షాపింగ్మాల్ ప్రారంభం

Dec 3 2016 1:27 AM | Updated on Apr 3 2019 9:14 PM

విశాఖలో సౌత్ఇండియా షాపింగ్మాల్ ప్రారంభం - Sakshi

విశాఖలో సౌత్ఇండియా షాపింగ్మాల్ ప్రారంభం

సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్ తాజాగా విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లో కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది.

హైదరాబాద్: సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్ తాజాగా విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లో కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, నటుడు అఖిల్ అక్కినేని, నటి సమంత సహా పలువురు ప్రముఖుల పాల్గొన్నారు.

అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందిచడమే తమ లక్ష్యమని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్లు సురేశ్, స్పందన, అభినయ్, రాకేశ్, కేశవ్‌లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాంప్రదాయశైలి మొదలుకొని ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించే అన్ని రకాల వైవిధ్యభరితమైన వస్త్రాలను అందించడం సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్ ప్రత్యేకతని అఖిల్ అక్కినేని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement