జియోకు మరో షాక్‌: ఎయిర్‌టెల్ 50జీబీ డేటా | Airtel Offers 50GB Data, Unlimited Calls With Rs. 999 Postpaid Plan  | Sakshi
Sakshi News home page

జియోకు మరో షాక్‌: ఎయిర్‌టెల్ 50జీబీ డేటా

Oct 12 2017 12:18 PM | Updated on Oct 12 2017 5:07 PM

Airtel Offers 50GB Data, Unlimited Calls With Rs. 999 Postpaid Plan 

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌, రియలన్స్‌ జియోతో వార్‌ కొనసాగిస్తూనే ఉంది. రోజుకో కొత్త ప్రకటనతో జియోకు కౌంటర్‌ ఇస్తోంది. నిన్ననే తొలిసారి 4జీ యూజర్ల కోసం రూ.1,399తో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ఎయిర్‌టెల్‌, తాజాగా మరో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. తన పోస్టుపెయిడ్‌ యూజర్ల కోసం కొత్త మైప్లాన్‌ ఇన్‌ఫినిటీ పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద 50జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. రోమింగ్‌ ఇన్‌కమింగ్‌ కాల్స్‌, రోమింగ్‌ అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ కూడా ఈ ప్లాన్‌ కింద అపరమితమే. ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ ప్లాన్‌ కొత్త, పాత యూజర్లందరికీ అందుబాటులో ఉంటుందని, వాడుకోని డేటాను వచ్చే బిల్లింగ్‌ సైకిల్‌కు పంపించుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొంది.

గత నెల సెప్టెంబర్‌లో ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం కూడా కంపెనీ రూ.999 ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. ఆ రీఛార్జ్‌ కింద రోజుకు 4జీబీ డేటా చొప్పున 112జీబీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. అయితే ప్రస్తుతం పోస్టుపెయిడ్‌ యూజర్లకు తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో ఎలాంటి రోజువారీ పరిమితులు లేవు. ఒక్కసారి 50జీబీ డేటా అయిపోతే, ఒక్కో ఎంబీకి 50 పైసా ఛార్జ్‌ పడుతోంది. జియో కూడా తన రూ.999 పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ కింద 90జీబీ డేటాను ఎలాంటి పరిమితులు లేకుండా అందిస్తోంది. జియో ప్లాన్‌ వాలిడిటి 2 నెలలు. 

Advertisement
 
Advertisement
Advertisement