ఎయిర్‌టెల్‌ దూకుడు: మరో ఆకర్షణీయ ప్లాన్‌ | Airtel introduces New Prepaid Plan Rs 249 recharge | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ దూకుడు: మరో ఆకర్షణీయ ప్లాన్‌

Apr 11 2018 6:27 PM | Updated on Apr 11 2018 6:29 PM

Airtel introduces   New Prepaid Plan Rs 249 recharge  - Sakshi

సాక్షి, ముంబై:  టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌  దూకుడు ప్రదర్శింస్తోది. కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ప్రకటించిన మరుసటి రోజే మరో సరికొత్త ప్లాన్‌తో యూజర్లను ఆకర్షిస్తోంది.   తాజాగా కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రారంభించింది.  అదే రూ.249  ప్లాన్‌. రూ.249రీఛార్జ్‌  ద్వారా వినియోగదారులు  రోజుకు 2 జీబీ  (3జీ/4జీ) డేటా అందిస్తుంది.  ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 56జీబీ డేటా పొందవచ్చు.  దీంతోపాటు  అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

దీంతోపాటు రూ.349 ప్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్‌ పునరుద్ధరించింది. ఇప్పటి వరకూ అందిస్తున్న 2.5జీబీ డేటా స్థానంలో  తాజాగా 28రోజుల పాటు రోజుకు 3జీబీ డేటాను అందించనుంది. కాగా  రూ.499 రీఛార్జ్‌తో నిన్న (మంగళవారం) కొత్త ప్రీపెయిడ్‌ను ప్రకటించింది. ఇందులో  ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తో పాటు, రోజుకు 2జీబీ డేటాను 82 రోజుల పాటు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement