గుడ్‌న్యూస్‌ : ఏఐతో భారీగా ఉద్యోగాలు | AI will eliminate 1.8 mn jobs but create 2.3 mn jobs by 2020: Gartner | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌ : ఏఐతో భారీగా ఉద్యోగాలు

Oct 6 2017 3:24 PM | Updated on Aug 20 2018 4:52 PM

 AI will eliminate 1.8 mn jobs but create 2.3 mn jobs by 2020: Gartner - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల భారీ మొత్తంలో ఉద్యోగాల ఊడతాయంటూ పలు రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో గార్టనర్‌ ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల పోయే ఉద్యోగాల కంటే వచ్చే ఉద్యోగాలే ఎక్కువని వెల్లడించింది. 2020లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ జాబ్‌ మోటివేషన్‌కు సానుకూలంగా ఉంటుందని, ఇది కేవలం 1.8 మిలియన్‌ ఉద్యోగాలను కనుమరుగు చేస్తే, భారీగా 2.3 మిలియన్‌ ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తుందని గార్టనర్‌ తెలిపింది. 2019లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల కల్పించబడే ఉద్యోగాల కంటే పోయే ఉద్యోగాలు ఎక్కువై పోతాయని, కానీ 2020 వచ్చే నాటికి ఈ లోటును ఇది భర్తీ చేస్తుందని పేర్కొంది.

దీంతో పోయే ఉద్యోగాల కంటే వచ్చే ఉద్యోగాలు పెరుగుతాయని గార్టనర్‌ విశ్వాసం వ్యక్తంచేస్తోంది. క్రిప్టోకరెన్సీల ఆధారితంగా బ్లాక్‌ చైన్‌ను వాడుకుని బ్యాంకింగ్‌ ఇండస్ట్రీ వ్యాపార విలువలో 1 బిలియన్‌ డాలర్లను పొందుతుందని గార్టనర్‌ చెప్పింది. 2021 నాటికి 50 శాతానికి పైగా సంస్థలు, బోట్స్‌, చాట్‌బోట్ల సృష్టికే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తాయని వివరించింది. సంప్రదాయ మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్ల కంటే కూడా వీటికే ఎక్కువ ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement