భాగ్యనగరిలో 26 లక్షల చ.అ.ల్లో మాల్స్‌! | 8 shopping malls starts in hyderabad under 2018year ending | Sakshi
Sakshi News home page

భాగ్యనగరిలో 26 లక్షల చ.అ.ల్లో మాల్స్‌!

Mar 31 2017 11:08 PM | Updated on Sep 4 2018 5:07 PM

భాగ్యనగరిలో  26 లక్షల చ.అ.ల్లో మాల్స్‌! - Sakshi

భాగ్యనగరిలో 26 లక్షల చ.అ.ల్లో మాల్స్‌!

2017లో దేశంలో అందుబాటులోకి రానున్న మాల్స్‌లో హైదరాబాద్‌ తొలిస్థానంలో నిలిచింది.

2017లోనే 8 మాల్స్‌ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్‌: 2017లో దేశంలో అందుబాటులోకి రానున్న మాల్స్‌లో  హైదరాబాద్‌ తొలిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది 26 లక్షల చ.అ.ల్లో కొత్తగా 8 మాల్స్‌ రానున్నాయి. నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని.. త్వరలోనే ఒక్కోటి అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, ఉప్పల్‌ ప్రాంతాల్లో ఈ మాల్స్‌ వస్తున్నాయి. శాంతా శ్రీరామ్, ఎస్‌ఎంఆర్, టీఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, అశోకా బిల్డర్స్‌ వంటి సంస్థలు ఆయా మాల్స్‌ నిర్మాణంలో ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో రైలుతో పాటూ మెట్రో స్టేషన్లు, డిపోలు, సమీప ప్రాంతాల్లో షాపింగ్‌ మాల్స్‌ను కూడా నిర్మిస్తోంది. 1.85 కోట్ల చ.అ. రిటైల్‌ స్థలంలో తొలి దశలో 60.5 లక్షల చ.అ. మేర నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో 10.1 లక్షల చ.అ. స్థలం 2017లో అందుబాటులోకి రానుంది. ఎర్రమంజిల్, పంజగుట్ట, హైటెక్‌ సిటీల్లో నిర్మిస్తున్న మాల్స్‌ 2017లో అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఇతర నగరాల్లో అందుబాటులోకి రానున్న మాల్స్‌ గణాంకాలను పరిశీలిస్తే.. చెన్నైలో 2.5 మిలియన్‌ చ.అ., ముంబైలో 2.3 మిలియన్‌ చ.అ., బెంగళూరులో 2 మిలియన్‌ చ.అ., పుణెలో 0.4 మిలియన్‌ చ.అ., కోల్‌కతాలో 0.3 మిలియన్‌ చ.అ., అహ్మదాబాద్‌లో 0.2 మిలియన్‌ చ.అ., ఎన్‌సీఆర్‌లో 0.2 మిలియన్‌ చ.అ.ల్లో షాపింగ్‌ మాల్స్‌ రానున్నాయి.

మొత్తం మీద దేశంలో 2017 ముగింపు నాటికి 91 లక్షల చ.అ. విస్తీర్ణంలో మాల్స్‌ రానున్నాయని జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. బెంగళూరులో వెగా సిటీ, జీటీ మాల్, పుణెలో ది పెవీలియన్, ఎన్‌సీఆర్‌–ఢిల్లీలో డీఎల్‌ఎఫ్‌ ఎంపోరియా, ముంబైలో గ్రాండ్‌ సెంట్రల్‌ సీవుడ్స్‌ మాల్స్‌ ఈ ఏడాది అందుబాటులోకి రానున్నాయి.  

హైదరాబాద్‌లో ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో రైలుతో పాటూ మెట్రో స్టేషన్లు, డిపోలు, సమీప ప్రాంతాల్లో షాపింగ్‌ మాల్స్‌ను కూడా నిర్మిస్తోంది. 1.85 కోట్ల చ.అ. రిటైల్‌ స్థలంలో తొలి దశలో 60.5 లక్షల చ.అ. మేర నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో 10.1 లక్షల చ.అ. స్థలం 2017లో అందుబాటులోకి రానుంది. ఎర్రమంజిల్, పంజగుట్ట, హైటెక్‌ సిటీల్లో నిర్మిస్తున్న మాల్స్‌ 2017లో అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement