‘రామయపట్నం’ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి | ysrcp to fight for Ramayapatnam port, says mps mekapati yv subbareddy | Sakshi
Sakshi News home page

‘రామయపట్నం’ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి

May 26 2017 3:14 PM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రకాశం జిల్లాలోని రామయపట్నం పోర్టు కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆపార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అన్నారు

ఒంగోలు : ప్రకాశం జిల్లాలోని రామయపట్నం పోర్టు కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని  ఆపార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అన్నారు.  మేజర్‌ పోర్టు ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుంద‌ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామయపట్నం పోర్టు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం కోలుకుంటుందని, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్లే హోదా ఆలస్యం అవుతుందన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement