ఆడ పిల్లలకు రక్షణ కరువు

YSRCP Rally For Padmavathi And Supporting Her Parents - Sakshi

చోడవరంలో వైఎస్సార్‌ సీపీ భారీ ఆందోళన..పోలీస్‌ స్టేషన్‌ ముట్టడి

బాలికను హత్య చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్‌  

బాధితురాలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలంటూ నినాదాలు

విశాఖపట్నం, చోడవరం: ఆడ పిల్లలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌ సీపీ ఆవేదన వ్యక్తం చేసింది. చోడవరంలో పిల్లల పద్మావతి అనే బాలికపై అత్యాచారం, దారుణ హత్య నేపథ్యంలో శుక్రవారం చోడవరంలో ఆ పార్టీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. బాలిక పద్మావతిని దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందించాలని నినదించింది. పార్టీ అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్లమెంటు సమన్వయకర్త వరుదు కల్యాణి, చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీతో పాటు మహిళలు, నాయకులు పెద్దసంఖ్యలో చోడవరం పార్టీ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా పోలీసు స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని, టీడీపీ నాయకుల గూండాయిజం నశించాలని, ఎమ్మెల్యే ఆగడాలకు బుద్ధి చెప్పాలం టూ నినాదాలు చేశారు. ఆడపిల్లలకు రక్షణ కల్పిం చాలంటూ పోలీసు స్టేషన్‌ను ముట్టడించి ధర్నాకు ప్రయత్నించగా, సీఐ శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని ఆందోళన చేయవద్దని కోరారు. రాజకీ య ఒత్తిళ్లకు తలొగ్గి కేసును నీరుగారిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిందితులను శిక్షించాలని అమర్‌నాథ్‌ సీఐను కోరారు. అనంతరం నిరసన ప్రదర్శనను కోటవీధిలో ఉన్న బాధితురాలి ఇంటి వరకు నిర్వహించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బాలిక తల్లిదండ్రులు లక్ష్మి, ఈశ్వరరావును నాయకులు పరామర్శించి ఓదార్చారు. కొంత ఆర్థిక సా యం అందించారు. ‘మీకు న్యాయం జరిగే వరకు మీ తరఫున పోరాడతా’మని భరోసా ఇచ్చారు.

నిందితులు.. ఎమ్మెల్యే అనుచరులే?
అమర్‌నాథ్‌ మాట్లాడుతూ చోడవరంలో అశాంతి నెలకొందని, ఈ దారుణానికి పాల్పడిన యువకులు స్థానిక ఎమ్మెల్యే రాజు వెంట తిరుగుతున్న వారేనని..ఎమ్మెల్యే పుట్టినరోజుకు వేసిన ఫ్లెక్సీలో ప్రధాన నిందితుడు కూడా ఉండటం.. ఆ ప్లెక్సీని ఎవరికీ ఇవ్వవద్దని ప్రింటింగ్‌ షాపు నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు ఒత్తిడి తెచ్చినట్టు తెలి సిందని చెప్పారు. తమ పార్టీ అధినేత వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిపై ఇటీవల జరిగిన దాడి చూస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనాయకుడికే రక్షణ లేకపోతే మిగతా ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంవదన్నారు. తుందన్నారు. వరుదు కల్యాణి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అండదండలు చూసుకొనే ఆయన అనుచరులు రెచ్చిపోయి ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మం డిపడ్డారు. బాలికను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాం డ్‌ చేశారు. రూ.20లక్షల పరిహారం అందించాలన్నారు. పార్టీ  విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గెడ్డం ఉమ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మళ్ల శ్రీదేవి, అనకాపల్లి జిల్లా ప్రధానకార్యదర్శి ఏడువాక సత్యారావు, మండల అధ్యక్షుడు పల్లా నర్సింరావు, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మారి శెట్టి శ్రీకాంత్, గౌరవ అధ్యక్షుడు బొడ్డే డ సూర్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు సూరి శెట్టి గోవింద, పిల్లల గోవింద, కోన చంద్రరావు, బైన ఈశ్వరరావు, సర్పంచ్‌లు మొల్లి సోమునాయుడు, నాయకులు ఓరుగంటి నెహ్రూ, గూనూరు రామకృష్ణ, పందిరి శ్రీనువాసరావు, చిటికెల నాగేష్, బొడ్డు ప్రసాద్, చంద్రరావు, ఎస్సీసెల్‌ జిల్లా, మం డల, పట్టణ అధ్యక్షులు వేచలపు ప్రకాష్, గాడి అప్పారావు, మహిళా ప్రతినిధులు మర్రిపల్లి శోభ, చేకూరి పద్మావతి, బలిజపల్లి లక్ష్మి, అల్లాడ భవా నీ, వరలక్ష్మి, లక్కుందాసు సూర్యకుమారి తదిత రులు పాల్గొన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో రక్షణ కరువు
విశాఖ క్రైం: చోడవరంలో మైనర్‌ బాలికను దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ నగర మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అట్టా డ బాబూజీకి ఆయన కార్యాలయంలో శుక్రవా రం వినతిపత్రం అందజేశారు. గౌరి మాట్లాడు తూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలు, విద్యార్థినులు, మైనర్‌ బాలికలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. ఈ రాష్ట్రంలో మహిళల కు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందా రు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. విమానాశ్రయంలో తమ పార్టీ అధినేతపై హత్యాయత్నానికి పాల్పడితే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య సం ఘటనను ఖండిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీని కలి సిన వారిలో పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధా న కార్యదర్శి శ్రీదేవి వర్మ, మళ్ల ధనలత, సాడి పద్మారెడ్డి, విశాఖ పార్లమెంట్‌ సంయుక్త కార్యదర్శి జ్యోతి, కుమారి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top