
అందరికి.. మంచి జరగాలని కోరుకున్నా: రోజా
చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీనటి రోజా సోమవారం తిరుమల విచ్చేశారు.
తిరుమల : చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీనటి రోజా సోమవారం తిరుమల విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రోజాకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఏటా కార్తీక మాసంలో తిరుమల వచ్చి వెంకన్నను దర్శించుకోవటం ఆనవాయితీ అని చెప్పారు. అందులో భాగంగానే స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు రోజా తెలిపారు.