శిలాఫలకంపై వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ పేరు లేదు | YSRCP MPTC Name skipped on Road construction Foundation stone | Sakshi
Sakshi News home page

శిలాఫలకంపై వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ పేరు లేదు

Aug 16 2015 12:42 PM | Updated on Aug 30 2018 5:49 PM

శిలాఫలకంపై వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ పేరు లేదు - Sakshi

శిలాఫలకంపై వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ పేరు లేదు

కోవూరు మండలం పొడుగుపాడు గ్రామం వద్ద రోడ్డు నిర్మాణానికి టీడీపీకీ చెందిన కోవూరు ఎమ్మెల్యే శ్రీనివాసులురెడ్డి ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు.

కోవూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : కోవూరు మండలం పొడుగుపాడు గ్రామం వద్ద రోడ్డు నిర్మాణానికి టీడీపీకీ చెందిన కోవూరు ఎమ్మెల్యే శ్రీనివాసులురెడ్డి ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. అయితే శిలాఫలకంపై వైఎస్సార్‌సీపీకి చెందిన స్థానిక ఎంపీటీసీ మొహిదీన పేరు లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఆ ప్రాంతానికి సంబంధం లేని టీడీపీ ఎంపీటీసీ ఎస్‌కె పర్వీన్ పేరు వేశారు. దాంతో ఆగ్రహించిన పొడుగుపాడు సర్పంచ్ రమణమ్మ(వైఎస్సార్‌సీపీ) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆందోళన చేయాలని నిర్ణయించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement