ఒంగోలు మున్సిపల్ కార్మికుల ధర్నాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి | YSRCP MP YV Subbareddy stages dharna In Support Of Agitating Sanitation Workers | Sakshi
Sakshi News home page

ఒంగోలు మున్సిపల్ కార్మికుల ధర్నాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

Jul 25 2015 3:13 PM | Updated on May 29 2018 2:59 PM

ఒంగోలు మున్సిపల్ కార్మికుల ధర్నాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - Sakshi

ఒంగోలు మున్సిపల్ కార్మికుల ధర్నాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

తమ సమస్యలను పరిష్కరించాలని 16రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులకు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తన మద్దతు తెలిపారు.

ఒంగోలు (ప్రకాశంజిల్లా) : తమ సమస్యలను పరిష్కరించాలని 16రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులకు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తన మద్దతు తెలిపారు. శనివారం కార్మికులు దీక్ష చేస్తున్న శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తోందని అన్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి ప్రభుత్వ పాలనను స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement