నమ్ముకుంటే నట్టేట ముంచారు : రోజా | YSRCP MLA Roja Meets Chittoor Collecter | Sakshi
Sakshi News home page

నమ్ముకుంటే నట్టేట ముంచారు : రోజా

Oct 19 2018 5:38 PM | Updated on Oct 19 2018 8:28 PM

YSRCP MLA Roja Meets Chittoor Collecter - Sakshi

ప్రజా ప్రతినిధిగా ముద్దుకృష్ణమ నాయుడి సతీమణి సరస్వతి ఉండగా ప్రభుత్వం కార్యక్రమాల్లో మాత్రం ఆమె కొడుకు పాల్గొంటున్నాడని..

సాక్షి, చిత్తూరు : టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం ప్రోటోకాల్‌ను పక్కదారి పట్టిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌.కే రోజా విమర్శించారు. ప్రజా ప్రతినిధిగా ముద్దుకృష్ణమ నాయుడి సతీమణి సరస్వతి ఉండగా ప్రభుత్వం కార్యక్రమాల్లో మాత్రం ఆమె కొడుకు పాల్గొంటున్నాడని రోజా ఆరోపించారు. భవిష్యత్తులో లా అండ్‌ ఆర్డర్‌ సమస్య వస్తుందని దీనిపై స్థానిక కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లాలోని వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ఆమె కల్టెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రావాలి జగన్‌, కావాలి జగన్‌ కార్యక్రమం ద్వారా నగరి నియోజకవర్గ ప్రజలు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. చంద్రబాబును నమ్మితే నట్టేట ముంచారని ప్రజలంతా అనుకుంటున్నారని, తమ నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు నిధులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకుండా చంద్రబాబు నాయుడు కుట్ర పూరింతంగా వ్యవహరించినా.. తన వంతు సహాయం ప్రజలకు అందిస్తున్నానని రోజా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని.. వెంటనే ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement