‘డర్టీ పొలిటీషియన్‌ అని అదే కేసీఆర్‌ అనలేదా’ | YSRCP MLA RK Roja Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘డర్టీ పొలిటీషియన్‌ అని అదే కేసీఆర్‌ అనలేదా’

Jan 21 2020 11:17 AM | Updated on Jan 21 2020 11:43 AM

YSRCP MLA RK Roja Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ రెండవ రోజు సమావేశాల్ని కూడా ప్రతిపక్ష టీడీపీ పదే పదే అడ్డుకోవడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు సమావేశాల్లో ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు బిల్లును ప్రవేశపెడితే.. దానికి టీడీపీ అడ్డుపడటం దారుణమన్నారు. ప్రతీ విషయంపై టీడీపీ గొడవ చేస్తోందని రోజా అన్నారు. మహిళలపై టీడీపీ సభ్యులు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, అసలు వారికి జ్ఞానం ఉందా అని రోజా ప్రశ్నించారు. ఇక చంద్రబాబు తన ప్రసంగంలో ఒక్కసారి కూడా సీమ గురించి మాట్లాడలేదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పొగిడినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.

అయితే అదే చంద్రబాబును డర్టీ పొలిటీషియన్‌ అని కేసీఆర్‌ విమర్శించిన సంగతి మరచిపోయారా అని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిషియన్‌ దేశ చరిత్రలోనే లేడని కేసీఆర్‌ అన్న సంగతిని గుర్తు చేశారు. వికేంద్రీకరణ జరగకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని నిలదీశారు. అమరావతి గురించి నానా హంగామా చేస్తున్న చంద్రబాబు ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కూడా ఎందుకు కట్టలేకపోయారని అడిగారు. తండ్రీ, కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుని, ఇప్పుడు అమరావతిపై హడావుడి చేస్తున్నారన్నారన రోజా మండిపడ్డారు. 

చదవండి:
సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం

అమరావతి రైతులకు వరాలు

వికేంద్రీకరణకు కేబినెట్‌ ఆమోదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement