'చంద్రబాబుకు ఎప్పటికీ బుద్ధిరాదు' | ysrcp leaders slams on tdp | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు ఎప్పటికీ బుద్ధిరాదు'

Jun 23 2015 11:14 AM | Updated on Aug 29 2018 6:26 PM

తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిన చంద్రబాబు నాయుడు ఇపుడు అదే విధానాన్ని ఏపీలోనూ అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి ధ్వజమెత్తారు.

తిరుపతి: తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిన చంద్రబాబు నాయుడు ఇపుడు అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు మంగళవారం తిరుపతిలో మాట్లాడుతూ చంద్రబాబు బుద్ధిఇంకా మారలేదన్నారు.

 

ప్రకాశం, కర్నూలు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందల కోట్లు వెదజల్లుతూ..ప్రతిపక్ష పార్టీ సభ్యలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం డబ్బుల ద్వారానే ఎమ్మెల్సీ పదువులను గెలవాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారన్నారు. బాబుకి ఎప్పటికీ బుధ్దిరాదని, ఆయన విధానం అంతేనని విమర్శించారు.

ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్సీ స్ధానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ నేతలు వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ సభ్యులను ప్రలోభపెట్టి నెల్లూరులోని ఓ హోటల్ లో దాచిపెట్టిన సంగతి తెలిసిందే. ఒక్కో ఎంపీటీసీ కి రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముందుస్తుగా రూ. 50 వేలు ముట్టజెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement