మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గొట్టిపాటి నరసయ్య కన్నుమూత | YSRCP leader gottipati narasaiah passes away | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గొట్టిపాటి నరసయ్య కన్నుమూత

Dec 7 2013 7:53 AM | Updated on May 29 2018 4:06 PM

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గొట్టిపాటి నరసయ్య కన్నుమూత - Sakshi

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గొట్టిపాటి నరసయ్య కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి నరసయ్య (51) కన్నుమూశారు.

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి నరసయ్య (51) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నరసయ్య ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

రేపు ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా యద్దనపూడిలో అంత్యక్రియలు జరుగుతాయి. నరసయ్య 1997 ఉపఎన్నికల్లో, 1999 ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన తండ్రి గొట్టిపాటి హనుమంతరావు సీనియర్ రాజకీయవేత్తగా, మంత్రిగా పనిచేశారు. తండ్రి మరణానంతరం 97 ఉపఎన్నికల్లో నరసయ్య గెలుపొందారు.

Advertisement
 
Advertisement
Advertisement