
మాట్లాడుతున్న శిరిష
సైదాపురం నెల్లూరు: రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా మహిళ అధ్యక్షురాలు, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పొట్టేళ్ల శిరీష అన్నారు. మండలంలోని తురిమెర్ల గ్రామంలోని ఆమె స్వగృహంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌లో శుక్రవారం రోజున చంద్రగ్రహణమని ఎటువంటి శని నివారణ పూజలు, హోమాలు చేయనవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రగ్రహణం నాలుగేళ్ల క్రితమే పట్టిందని ఆమె అన్నారు. రాష్ట్రానికి పట్టిన ఆ చంద్రగ్రహణం దెబ్బకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
మరో వైపు చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి లేక సమాజంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. ప్రపంచానికి చంద్ర గ్రహణం 5గంటలు మాత్రమే కానీ ఆంధ్రప్రదేశ్‌కు 5ఏళ్లు ఉందన్నారు. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహాణన్ని వదిలించడం ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు. అదే విధంగా మద్యం దుకాణాలు లేకుండా చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం జరిగిందన్నారు. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా లోకం అంతా స్వాగతించదగ్గ విషయమన్నారు.