ఇద్దరు సభ్యుల్ని సభకు అనుమతించండి | ysrcp jyothula nehru appeals to speaker on allow the suspended members | Sakshi
Sakshi News home page

ఇద్దరు సభ్యుల్ని సభకు అనుమతించండి

Aug 27 2014 1:04 PM | Updated on Aug 18 2018 5:15 PM

అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన తమ సభ్యులు శివప్రసాద్‌ రెడ్డి, మణిగాంధీని తిరిగి సభకు అనుమతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

హైదరాబాద్ : అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన తమ సభ్యులు శివప్రసాద్‌ రెడ్డి, మణిగాంధీని తిరిగి సభకు అనుమతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. స్వల్ప విరామం తర్వాత సభ ప్రారంభం కాగానే ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు జ్యోతుల నెహ్రూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

 

అలాగే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విషయంలోనూ ఏ చర్య తీసుకోవద్దని కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించాలని బిజెపి కూడా కోరింది. సంప్రదాయానికి అనుగుణంగా వారు క్షమాపణ కోరితే సస్పెన్షన్ రివోక్ చేయవచ్చని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement