వైఎస్సార్‌సీపీలో చేరిన మట్లగొంది సర్పంచ్ | YSRCP joined matlagondi Sarpanch | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన మట్లగొంది సర్పంచ్

Oct 4 2013 3:22 AM | Updated on Jun 1 2018 8:47 PM

మండలంలోని మట్లగొంది గ్రామ పంచాయతీ సర్పంచ్ వెంకటరమణ, మాజీ సర్పంచ్ భర్త శంకర్, వారి అనుచరులు 200 మంది వైఎస్సార్ సీపీలో చేరారు.

శింగనమల, న్యూస్‌లైన్: మండలంలోని మట్లగొంది గ్రామ పంచాయతీ సర్పంచ్ వెంకటరమణ, మాజీ సర్పంచ్ భర్త శంకర్, వారి అనుచరులు 200 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. శింగనమలలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి చేపట్టిన నిరాహార దీక్షకు గురువారం వారు సంఘీభావం తెలిపి పార్టీలో చేరారు. వారితో పాటు మాజీ సింగిల్ విండో డెరైక్టర్ నాగలింగ, ఆదినారాయణ, శేషయ్య, గోపాలు, అనుచరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
 
 
 సాంబశివారెడ్డి వారందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అలాగే మండలంలోని కొరివిపల్లి గ్రామ పంచాయతీ చీలేపల్లికి చెందిన ఉప సర్పంచ్ కొండారెడ్డి, ప్రకాష్‌బాబు, సూర్యనారాయణరెడ్డి, సోమశేఖర్, రాజన్న, తిరుపతయ్య, అనుచరులతో పాటు కొత్తపల్లి తిమ్మారెడ్డి, రాచేపల్లి లక్ష్మినారాయణ, చిన్న జలాలపురం బండి శ్రీనివాసులు, బండి లలితకుమారి, సోదనపల్లి మల్లేష్, తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు. కార్యక్రమంలో మండల నాయకులు శ్రీరామిరెడ్డి, కన్వీనరు చెన్నకేశవులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement